పత్తికొండ (చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో గుండెపోటుకు గురై చనిపోయి న కార్యకర్త పిల్లలకు అండగా ఉంటానని భువనమ్మ భరోసా ఇచ్చా రు. కర్నూలు జిల్లా పత్తికొండ నియో జకవర్గం, కృష్ణగిరి మండలం, ఎర్రగుడి గ్రామంలో పార్టీ కార్యకర్త పింజరి సుభాన్ కుటుంబాన్ని గురవారం భువనమ్మ పరామర్శించారు. సుభాన్ పిల్లలను చూసి చలించిపోయారు. పిల్లలు చిన్న వయస్సులో ఉన్న సమయం లో సుభాన్ మృతికుటుంబానికి తీరని లోటుగా పరిగణించిన భువనమ్మ వారికి అన్ని విధాలా తోడుంటానని హామీఇచ్చారు. సుభాన్ కుమార్తె ఆస్మకు కంటి చూపులేని విషయం తెలుసుకుని తగిన చికిత్స అందించే బాధ్యత తీసుకున్నారు.
ఆస్మకు చూపు వచ్చేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తా మన్నారు. అదేవిధంగా అంధ బాలల విద్యాలయంలో ఆస్మకు ఉచిత విద్య అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్మకు కంటి చూపు వస్తుందని డాక్టర్లు ధృవీకరిస్తే ఆపరేషన్ కు అయ్యే పూర్తి ఖర్చు తానే భరించి ఆదుకుంటానన్నారు. సుభాన్ పెద్ద కుమారుడు ఖలీల్బాషాకు ఉచిత విద్య అందిస్తానని హామీఇచ్చారు. భువనమ్మ తమ కుటుంబం పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కు సుభాన్ భార్య జమీలా, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.