- ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేత
- ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా
విజయనగరం: విజయనగరం జిల్లాలో బుధవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగింది. తొలుత భువనేశ్వరి విజయనగరం 29వ వార్డులో టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గత ఏడాది గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్ సాయిలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించి..కుటుంబానికి తెలుగుదేశంపార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పిం చారు. భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు కూడా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
పైడియ్య కుటుంబానికి పరామర్శ
అనంతరం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మం డలం, పెరుమల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ కార్య కర్త మైలేపల్లి పైడియ్య(50) కుటుంబాన్ని భువనేశ్వ రి పరామర్శించారు. పైడియ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనసాంతపానికి గురైన పైడియ్య గత ఏడాది అక్టోబర్ 2న మరణించాడు. పైడియ్య కుమారుడు రాంబాబు, కోడలు భారతితో భువనేశ్వరి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని వారు వాపోయారు. టీడీపీ స్థాపిం చిన నాటి నుండి పైడియ్య టీడీపీ జెండాను తప్ప మరే ఇతర జెండా పట్టలేదని వివరించారు. కుటుం బ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భువనేశ్వరి హామీ ఇచ్చారు. రూ.3లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందించారు. పైడియ్య కుమారుడు తమ ఇల్లు పాడైపోయిందని, కొత్త ఇల్లు కట్టించుకునేందుకు సాయమందించాలని భువనేశ్వరిని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెర్లం మండ లం కార్యకర్తలు పెద్దఎత్తున పైడియ్య ఇంటి వద్దకు చేరుకుని భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్య క్రమానికి సంఫీుభావం తెలిపారు.
అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ
తెర్లం మండలంలోనే మోదుగువలస పంచాయ తీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన పార్టీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభి మానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకో లేక గుండెపోటుతో గత ఏడాది సెప్టెంబర్ 9న మర ణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్ర పటా నికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్య కర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని అప్పారావు కుటుంబానికి తెలిపారు.అప్పారావు భా ర్య పైడాలమ్మ, కుమారులు సత్యనారాయణ, రామా రావు, నాయుడు, కుటుంబ సభ్యులు సీహెచ్ సింహా చలం భువనమ్మతో మాట్లాడుతూ… తమ తండ్రి 1983 నుండి టీడీపీ కార్యకర్తగానే కొనసాగి కన్ను మూశారని తెలిపారు. తాము కూడా ఊహ తెలిసిన నాటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నామని వివ రించారు. వైసీపీ మూకలు తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాయని, ఆటుపోటులను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నా మన్నారు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొ చ్చేందుకు మరింత కృషిచేయాలని భువనమ్మ కోరా రు. వృద్ధాప్యంలో భర్తను కోల్పోయిన పైడాలమ్మకు రూ.3లక్షల చెక్కును అందించి మీకు మేమున్నాం.. ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.