- అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపిస్తాం
- వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టింది
- రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
- రేవేంద్రపాడు అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా భువనేశ్వరి వ్యాఖ్యలు
మంగళగిరి: అన్నదానం.. మహాదానమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీ మణి భువనేశ్వరి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చే అన్న కాంటీన్లు తిరిగి తెరిపిస్తామన్నారు. మంగళ గిరి నియోజకవర్గం, రేవేంద్రపాడు గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో, తెలుగుయువత నాయకుడు కాసర్ల జస్వంత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీ న్ను నిజం గెలవాలి పర్యటన సందర్భంగా గ్రామా నికి వచ్చిన మంగళవారం భువనేశ్వరి ప్రారంభిం చారు.
క్యాంటీన్ ఏర్పాటుచేసిన జస్వంత్‌ను, నిర్వా హకులను భువనేశ్వరి అభినందించారు. ఈ సంద ర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు రూ.2కే కేజీ బియ్యం పథకాన్ని తీసుకొచ్చారన్నా రు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లుగా భావించిన ఎన్టీఆర్ గుర్తుగా టీడీపీ అధినేత చంద్ర బాబు 2018లో అన్న క్యాంటీన్లను ప్రారంభించా రన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 368 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదవాళ్లు కేవ లం రూ.5తో తమఆకలి తీర్చుకోవడానికి అన్న క్యాంటీన్లు ఎంతో ఉపక రించాయి. ఒక్కో క్యాంటీ న్లో రోజుకు వెయ్యి మంది భోజనం చేసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.25లక్షల మంది భోజనం చేసేవారు.
అన్నదానం.. మహాదానం అనేది చంద్రబాబు, తెలుగుదేశంపార్టీ ఉద్దేశం. 2019లో అధికారం లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అడ్డగోలుగా మూసేసి పేదవాళ్ల పొట్ట కొట్టింది. నేటికీ రాష్ట్రంలో 140 అన్న క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థ లు నడుపుతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. అన్న దాతలందరికీ నా కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసే నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో 7.25 కోట్ల మంది ప్రజలు భోజనం చేశారు. కుప్పంలో చంద్రబాబు, మంగళ గిరిలో లోకేష్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిరది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా పేదల ఆకలి తీరుస్తున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని భువనేశ్వరి చెప్పారు.