- వారికి అన్నివిధాలా న్యాయం చేసింది మేమే
- టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
కర్నూలు : వెనుకబడిన వర్గాలకు వెన్నెముక తెలుగుదేశంపార్టీ.వారికి అన్నివిధాలా న్యాయం చేసింది మనమే. బిసిలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ అని టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు. కర్నూలు లోని టిడిపి కార్యాలయంలో పార్టీ శ్రేణు లతో చంద్రబాబునాయుడు శుక్రవారం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలు వురు స్థానిక వైసిపినేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రారంభం నుండి పేదల పార్టీ తెలుగుదేశం. మొట్టమొదట భారతదేశ చరిత్రలో 25 కేంద్రాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆ తరువాత ఇది చాలదని గ్రహించి 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. 33శాతం నుండి 25శాతానికి తగ్గించిన నీచచరిత్ర ఈ జగన్మోహన్‌రెడ్డిదని అన్నారు.
బిసిలకు గుర్తింపు తెచ్చింది టిడిపినే
వెనుకబడినవర్గాలకు సమాజంలో గుర్తింపు తెచ్చి న ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబునాయుడు అన్నారు. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనేదే తెలుగుదేశం లక్ష్యం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ పథకాన్ని పెట్టాను. బీసీ సబ్‌ప్లాన్ తీసు కొచ్చాను. రాజకీయ ప్రాముఖ్యతను ఇచ్చాం. రెండు రాష్ట్రాల్లోపార్టీ అధ్యక్షులు బీసీలే ఉన్నారు.ఏపీలో అచ్చె న్నాయుడుఉంటే, తెలంగాణలో జ్ఞానేశ్వర్ ఉన్నారు. అదే టిడిపి చిత్తశుద్ధి, ఘనత. వైసీపీ బిసి సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. 50 కార్పొ రేషన్లు పెట్టి ఆ కార్యాలయాల్లో కనీసం కూర్చోవడా నికి కుర్చీలు కూడా ఇవ్వలేదని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
రాజకీయ రౌడీలొస్తున్నారు జాగ్రత్త
ఇటీవల రాజకీయ రౌడీలు వస్తున్నారు.. జాగ్రత్త గా ఉండాలి..అణచివేయడం కష్టం కాదు.. రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాదంతో అణచి వేసి నపార్టీ తెలుగుదేశం అని చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. ఆడబిడ్డల పట్ల వైసిపి కామాంధులు ఇష్టాను సారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించా రు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రా వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నేను ఒంటరి వాడిని కాదు.. ఐదు కోట్ల మంది ఆశీస్సులు తమకు ఉన్నాయని తెలిపారు. అయితే నేను వైసీపీ మాదిరి చిల్లర రాజకీయాలు చేయబోనని తెలిపారు.
వైసిపిలో దొంగలు, కబ్జాకోరులు
వైసీపీ నాయకులంతా దొంగలు, దోపిడీదారులు, రౌడీలు,కరడుగట్టిన నేరస్థులు, భూకబ్జాదారులు. ఇటీ వల రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు అధికమయ్యా యి. వైసీపీలోని ఛోటా మోటా నాయకులందరూ కూడా దొంగల్లా తయారయ్యారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రజలంతా అందరూ ఒకేమాట మీద ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. టిడిపి హయాంలో ఊర్దూ యూనివర్శిటీ తెచ్చాను. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేశానని చెప్పారు.
అది విశాఖపై ప్రేమ కాదు
వైసిపి దొంగలు ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తామంటున్నారు. అది విశాఖ ప్రజలపై ఉన్న ప్రేమ కాదు, అక్కడి భూములపై ఉన్న ప్రేమ అని చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు అనేక చోట్ల భూములు కబ్జా చేశారు. వారి నాటకాల ను ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చా ఓక ఎవరినీ వదిలిపెట్టం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దోచుకో దాచుకో అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అందరూ రేపటి నుంచి పార్టీ అభి వృద్ధి కోసం సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్రంలో ఎప్పు డు ఎన్నికలు వచ్చినా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచా లని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.