అమరావతి: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను నీలి మీడియా వక్రీకరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్రెడ్డి మంచి చేసి వుంటే, 99శాతం మేనిఫెస్టో అమలు చేసి ఉంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. నీలి మీడియాలో అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఐడీ వాదనను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించిందని చెప్పారు. బెయిల్రద్దుపై వెంటనే విచారణ చేపట్టా లన్న సీఐడి వాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసిందన్నారు. చంద్రబాబు రాజకీయ కార్యకలా పాలు, ప్రజా కార్యక్రమాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించలేదని స్పష్టంచేశారు. చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొన రాదని సుప్రీంకోర్టు చెప్పినట్టు నీలి మీడియా సాక్షిలో అబద్ధపు స్క్రోలింగ్స్ ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 99శాతం మేనిఫెస్టో హామీలు అమలుచేసి ఉంటే, లక్షల కోట్ల కుంభకోణాలు చేయకుండా ఉండి ఉంటే చంద్రబాబు ప్రజా పర్యటనలను అడ్డుకోవా ల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించారు. తన ప్రజా వ్యతిరేక విధానాలు, లక్షల కోట్ల లూటీని కప్పిపెట్టుకోవడానికే జగన్రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీతో చంద్ర బాబుపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అని అబద్ధపు ప్రచారాలు నీలి మీడియా ద్వారా చేస్తున్నారని చెప్పారు. తన అవలక్షణాల్ని ఎదుటివారికి అంటకట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజమని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.