- నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు
- ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్ ఆగ్రహం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వం హయాంలో నియమించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ నియామకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉపసహరించుకుంటే వక్ఫ్ బోర్డునే రద్దు చేశారని బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్ తీవ్రంగా ఖండిరచారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వర్ఫ్‌బోర్డు కమిటీ నియ మిస్తూ నవంబర్ 2023న జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.47 అమలుకు నోచుకోకుండా హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రెండేళ్లుగా రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు పాలకవర్గం లేకుం డా పోవడంతో ఇబ్బందులు పడిన విషయం వాస్తవం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డుకు తనకు నచ్చిన వారితో పాలకవర్గాన్ని నియమించుకునే అధికారం, హక్కులకు అనగు ణంగా జీవో 75ను జారీ చేసిందన్న విష యాన్ని మరిచిపోయి బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమె త్తారు. వక్ఫ్ చట్టంలోని నిబంధనలకు నాటి వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి ఇష్టా రాజ్యంగా నియమించిందని మండిపడ్డారు. దాంతో వక్ఫ్‌బోర్డు కమిటీ చెల్లుబాటును సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ ఉన్న విషయాన్ని కూడా అసత్య ప్రచారం చేసే వారు గుర్తించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటాన్ని సహించేదిలేదని స్పష్టం చేశారు.