- అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తాం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ
అమరావతి(చైతన్యరథం): శ్రీకాళహస్తి నియోజ కవర్గంలో అధికార పార్టీతో కుమ్మక్కైన కొందరు వాలంటీర్ల ప్రవర్తిస్తున్నతీరుపై అక్కడి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి చేసినవ్యాఖ్యలు ఆయన వ్యక్తిగ తం మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. అక్కడ కొంద రు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధ నలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమే. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పి స్తామని గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఇదే తెలుగు దేశంపార్టీ వైఖరి. ప్రజాప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైకాపా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలు గుదేశంపార్టీ సమర్థించదు.ఇప్పటికే ఎన్నికల నిబం ధనలు ఉల్లంఘించి వైకాపా చట్ట వ్యతిరేకత కార్య క్రమాల్లో పాల్గొన్న 200మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు.
వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వారి భవిష్యత్‌ను వారే పాడుచేసుకుంటున్నారు. జగన్‌రెడ్డి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీ ఎస్ అధికారులే జైలుకు వెళ్లినా ఆయన పట్టించు కోలేదు. అలాంటిది వాలంటీర్లపై కేసులు పడితే పట్టించుకుంటారా? ఒక్కసారి కేసుపడితే వారి భవి ష్యత్ అంధకారమే అని వాలంటీర్లు గ్రహించాలి. అందుకే వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు హితవు పలికారు.