• ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం గ్రామ దళితులు యువనేత లోకేష్ ను వినతిపత్రం సమర్పించారు.
• 2012లో అప్పటి ప్రభుత్వం మా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 280ఎకరాలు డీఫారం పట్టాలు ఇచ్చారు.
• నేటి వైసీపీ పాలకులు మా భూములను కబ్జా చేస్తున్నారు.
• బొమ్మవరం చెరువు పక్కనున్న పోరంబోకు పొలాన్ని పలువురు కబ్జా చేశారు.
• బొమ్మవరం చెరువును పూడ్చి ఇళ్లకు ప్లాట్లు వేశారు.
• చెరువుకిందనున్న ఆయకట్టు పొలాలు నీరులేక పంటలు ఎండిపోతున్నాయి.
• మా డీఫారం పట్టాలను కొంతమందికి 1బీ అడంగల్ లో ఎక్కించలేదు.
• మా గ్రామంలోని రహదారులను కొంతమంది కబ్జా చేస్తున్నారు.
• ఎమ్మార్వోకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక కబ్జాదారులనుంచి మా భూములకు రక్షణ కల్పించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులతోపాటు ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది.
• ఎపి చరిత్రలో తొలిసారిగా జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల భూ విస్తీర్ణం తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
• దళితుల వద్దనున్న 12వేల ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా లాగేసుకుంది.
• ప్రశ్నించిన దళితులపై వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోంది.
• వైసిపి భూబకాసురులు కొండలు, గుట్టలు, వాగులు, వంకలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల వద్దనుంచి వైసిపి నేతలు లాక్కున్న భూములను తిరిగి దళితులకు అప్పగిస్తాం.
• వైసిపినేతల వత్తిళ్లకు రికార్డులను తారుమారు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.