అమరావతి: గురుపూజోత్సవాన్ని గురువురు బహిష్కరించడం జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శన మని శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీ ఆర్ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటాం. నేడు మన రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్ డేని బహిష్కరిస్తున్నామని చెప్పడం బాధాకరం. గురుబ్రహ్మ అని గురువులని పూజించాలి. ప్రాణం రక్షించే వైద్యుడిని, విజ్ఞానాన్ని అందించే గురువులను ఎంతో గౌరవిస్తామన్నారు.
గురువులు ఒక్కరే కాదు జగన్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. గతంలో బతకలేక బడి పంతులు అంటే, నేడు బడి పంతులుగా బతకడం కష్టంగా ఉందన్నారు. ఉపాధ్యాయ పనులను ఈ ప్రభుత్వం పక్కన పెట్టి వారికి బ్రాంది షాపుల దగ్గర, బాత్రూమ్లు, మిడ్డే మీల్ ఫొటోలు తీసేపని పని అప్పగిస్తోందన్నారు. ఇలాంటి పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తిని అవమానపరుస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేస్తే, వాటిని ప్రభుత్వంలో విలీనం చేసి జీతాలిచ్చింది. జగన్ ప్రభుత్వానికి అదిభారం కాబట్టి ఎస్జీటీని రద్దు చేసి 10 వేల పైనే పోస్టులు ఖాళీ పెట్టింది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీనిచ్చిన జగన్‌రెడ్డి మూడేళ్లైనా ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేదు. గతంలో రెండు డీఎస్సీలు నిర్వహించిన ఘనత టీడీపీది అన్నారు.
సీపీఎస్ ఉద్యమం చేశారని అనేక మందిపై బైడోవర్ కేసులు పెట్టారు. బాండ్లు వంటివి రాయించు కున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 1న చేయాల్సిన ఉద్యమాన్ని జగన్‌రెడ్డి అణగతొక్కారు. ప్రభుత్వానికి ఉత్తమ టీచర్లు ఎలా కావాలో, అలానే వాళ్లు కూడా ఉత్తమ ప్రభుత్వం కావాలని కోరువడం తప్పా?. గురువు విలువ ముఖ్యమంత్రికి తెలుసా?
అక్రమాలలో అండగా నిలిచే అష్టదుష్ట గురువులు
అక్రమాలలో అండగా నిలిచేవారే జగన్ రెడ్డికి అష్టదుష్ట గురువులు. 1. మైనింగ్ మాఫియా గాలి జనార్ధన్ రెడ్డి, 2. ఎర్రచందనం, సాండ్ మాఫియా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, 3. లిక్కర్, ల్యాండ్ మాఫియా, దొంగ లెక్కలు విజయసాయి రెడ్డి, 4. జేట్యాక్స్ వసూల్ వై.ఎస్. భారతిరెడ్డి, 5. భూ మాఫియా, అరాచకాలు జగన్ రెడ్డి మేనమామ రవీంద్రా రెడ్డి, 6. సెటిల్మెంట్ సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి, 6. అబద్ధాల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 7. బూతుల కొడాలి నాని, 8. దాడులు, దౌర్జన్యాల పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వీల్లంతా జగన్ రెడ్డికి గురువులు. గురుపూజోత్సవం రోజు ముఖ్యమంత్రి వాళ్లందరిని సన్మానించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ సంఘాలలోని 95శాతం మంది ఆ కార్యక్రమం వద్దని బహిష్కరించారని తెలిపారు.