- డ్రగ్స్‌తో కూడిన రొయ్యల మేతను దిగుమతి చేసింది వైసీపీ నేత సోదరుడు
- వైసీపీ పెద్దల జోక్యంతో సీబీఐ సోదాను అడ్డుకున్న రాష్ట్ర పోలీసులు
- బ్రెజిల్ మూలాలను వెల్లడిరచిన విజయసాయిరెడ్డి శుభాకాంక్షల సందేశం
- విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్లుగా అంచనా
- రాష్ట్రంలో మత్తు సామ్రాజ్య విస్తరణకు బాధ్యత జగన్‌రెడ్డిదే
- యువతను డ్రగ్స్‌కు బానిసలు చేయటంపై తెదేపా నేత పట్టాభి ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం పోర్టులో గురువారంనాడు భారీస్థాయిలో మాదకద్రవ్యాలతో (డ్రగ్స్) కూడిన కంటైనర్ పట్టివేత రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాష్ట్రం లో గత ఐదేళ్లుగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడి లభ్యత, వినియోగం,రవాణా వార్తలతో కలత చెందుతున్న ప్రజా నీకం మరోసారి ఉలిక్కిపడిరది. జగన్‌రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక నైరాశ్యంతో విచ్చలవిడిగా లభిస్తున్న మత్తు పదార్థాల వినియోగానికి బానిసలై యువత నిర్వీర్యం అవడం పట్ల తీవ్ర ఆందో ళన నెలకొన్న నేపథ్యంలో విశాఖ సంఘటన రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కలిచివేసింది.
వెల్లడైన డ్రగ్స్ సామ్రాజ్య మూలాలు
విశాఖపట్నం పోర్టుకు ఈనెల 16న 25వేల కిలోల డ్రైడ్ ఈస్టుతో కూడిన ఒక భారీ కంటైనర్ బ్రెజిల్ దేశం నుంచి వచ్చింది. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఇంటర్ పోల్ హెచ్చరికతో సీబీఐ, కష్టమ్స్ అధికారులు బుధవారం నాడు రంగంలోకి దిగి పరిశీలన చేపట్టారు. రొయ్యలు, చేపల మేతలో వాడే డ్రైడ్ ఈస్ట్‌తో పాటు మాదకద్రవ్యాలు బ్రెజిల్ నుంచి వచ్చాయని సీబీఐ నిర్ధారించి తీగ లాగడంతో డొంకంతా కదిలింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పలు విష యాలను తెలుగుదేశంపార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శుక్రవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో వివరిం చి ఈ డ్రగ్స్ మాఫియా మూలాలు అధికార వైసీపీ నాయకులతో ముడిపడి ఉన్నట్లు వెల్లడిరచారు.
డ్రైడ్ ఈస్ట్‌ను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభ్రద రావుకి చెందిన కంపెనీ అని పట్టాభి వెల్లడిరచారు. పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన నాయకు డని, అతనికి, వీరభద్రరావుకి వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని పట్టాభి స్పష్టం చేశారు.
పూర్ణచంద్రరావుకి వైసీపీ ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టిందని.. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతల ఫొటోలతో తన గ్రామంలో ఫ్లెక్సీలు వేసి పూర్ణచంద్రరావు హడావిడి చేస్తుంటారని.. వైసీపీ కార్య క్రమాలన్నింటికీ ఆయనే అండగా ఉంటారని పట్టాభి తెలిపారు.
కాంగ్రెస్‌పార్టీలో ఉన్నకూనం కుటుంబం వైసీపీ ఆవి ర్బావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్నారన్న వాస్తవాన్ని వైసీపీ కాదనగలదా అని పట్టాభి ప్రశ్నించారు.
వైసీపీ మూలాలకు ఇతర ఆధారాలు
బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌కు వైసీపీ నేత లతో లింకులు ఉండటంవల్లనే సీబీఐ, కష్టమ్స్ అధికా రులు కంటైనర్‌ను పరిశీలించకుండా రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారని.. ఈ విషయాన్ని సీబీఐ తన నివేదికలో కూడా పేర్కొందని పట్టాభి వెల్లడిరచారు. డ్రగ్స్ దిగు మతితో వైసీపీ నేతలకు సంబంధం లేకపోతే పోలీసులు అలా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ఆయన నిల దీశారు. రెండేళ్ల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన లులూ డిసిల్వాకు వైసీపీ అగ్రనేత విజయ సాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారని పట్టాభి వెల్లడిరచా రు. అలా చేయటానికి వారిద్దరి మధ్య ఏదైనా వ్యక్తిగత మైత్రి ఉందా.. ఒక ప్రాంతీయపార్టీ నాయకుడు ఒక దక్షిణ అమెరికా దేశాధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపే సాంప్రదాయం ఉందాఅని ఆయన నిలదీశారు. ఒకవేళ వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం ఉంటే విజయసాయి రెడ్డి ఆనాడే ఎందుకు స్పష్టం చేయలేదని ప్రశ్నించారు.
ఆనాడే నిలదీసిన లోకేష్
విజయసాయిరెడ్డి గతంలో తన సెల్‌ఫోన్ పోయిం దని వెల్లడిరచినప్పుడే తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రెజిల్-వైసీపీ-డ్రగ్స్ వ్యవహారానికి సం బంధించి అనుమానం వ్యక్తంచేశారని పట్టాభి గుర్తు చేశారు. మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఏ వివరాలున్నా యి.. బ్రెజిల్ దేశంతో లావాదేవీలు, ఇతర వ్యవహారాల గురించి వివరాలు ఏమైనా ఉన్నాయా అని లోకేష్ ప్రశ్నించారని..ఆఅనుమానం నేడు నిజమైందని పట్టాభి అన్నారు.
నాడు పెట్టుబడుల రాష్ట్రం – నేడు మాదకద్రవ్యాల సామ్రాజ్యం
చంద్రబాబు హయాంలో పెట్టుబడులను రాబట్టడం లో నెంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రం జగన్‌పాలనలో మాదక ద్రవ్యాల సామ్రాజ్యంగా మారిందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో సీఎం ఇంటికి సమీపంలో ఉన్న విజయవాడలోని ఆషి ట్రేడిరగ్ పేరుతో వచ్చిన రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడటాన్ని పట్టాభి గుర్తు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాలో రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉం దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన డీఆర్‌ఐ నివేదిక వెల్లడిరచటాన్ని ఆయన ఉటం కించారు. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో సైతం రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది.
హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల విచ్చలవిడి లభ్యత, సరఫరాలతో జగన్ పాలనలో యువత జీవితాలు నాశనం అవుతు న్నాయని..కొలంబియా దేశానికిచెందిన డ్రగ్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ నుంచి స్ఫూర్తిపొంది ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ‘ఆంధ్ర ఎస్కోబార్’గా అవతరించాడని పట్టాభి ఆరోపించారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.50 వేల కోట్ల వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా.
స్వీయ పర్యవేక్షణ కోసమేనా జగన్ విశాఖకు?
సముద్రం ద్వారా ఏయే ఓడల్లో ఏమి సరుకులు వస్తున్నాయి.. ఏయే దేశాల నుంచి ఎటువంటి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి అన్న విషయాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖకు మకాం మారుస్తాననటానికి కారణమని పట్టాభి ఎద్దేవా చేశారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవుల ను ప్రైవేటు పరం చేయటంకూడా అక్రమ సరఫరా కోసమేనని అనిపిస్తోందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహించి యువత జావితాల్ని వైసీపీ నాయకులు నాశనం చేస్తుంటే ప్రజ లు క్షమించరని.. త్వరలో తగిన గుణపాఠం చెబుతా రని, ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్, డ్రగ్ మాఫియాలతో పొత్తు పెట్టుకొన్న జగన్‌రెడ్డి ఎన్నికల్లోకి సింగిల్‌గా వస్తు న్నాననటం హాస్యాస్పదమని కొమ్మారెడ్డి పట్టాభి వ్యాఖ్యా నించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ కుంభ కోణంపై సీబీఐ విచారణ జరిపి వైసీపీ పెద్దలపై చర్య లు చేపట్టాలని పట్టాభి డిమాండ్ చేశారు.