- 63 ఎకరాల దళితుల భూమి కబ్జా
- పొలం దగ్గరకు వెళితే బెదిరింపులు
- తహసీల్దారు, కలెక్టర్లకు చెప్పినా శూన్యం
- ప్రజావినతుల స్వీకరణలో బాధితుల గోడు
- అర్జీలు స్వీకరించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
- పరిష్కారం కోసం అధికారులకు ఆదేశం
మంగళగిరి(చైతన్యరథం): దళిత కుటుంబాలు 40 మందికి 1988లో మంజూరు చేసిన 63 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తమ్ముడు జెడ్పీటీసీ దేవ సాని సత్యనారాయణరెడ్డి 27 ఎకరాలు, ఎమ్మెల్సీ అనుచరులు మిగిలిన భూమిని దౌర్జన్యం గా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని కడప జిల్లా శ్రీ కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన బాధితులు వాపోయారు. పొలం దగ్గరకు వెళితే అనరాని మాటలు అంటూ బెదిరిస్తున్నారని తహసీల్దారు, ఎంపీడీవో, కలెక్టర్ల చుట్టూ తిరిగినా పట్టించు కోవ డం లేదని మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతు ల స్వీకరణ కార్యక్రమంలో నేతల ముందు వాపోయారు. కార్యాలయంలో బుధవారం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు.
` కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆమదాల చెరువుకు సంబంధించిన దాదాపు ఐదు ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి నాటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం ఆర్డీవో వసంతరాయుడులు అక్రమ లేఅవుట్‌లు వేశారని రావులపాలెం తెలుగు యువత అధ్యక్షు డు కోట చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏపీసీసీఎల్ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోకుండా జగ్గిరెడ్డి అడ్డుకున్నాడని తెలిపారు. చెరువులో అక్రమ లేఅవుట్‌లకు కారకుడైన జగ్గిరెడ్డి, అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` వైసీపీ నేతలు తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నా రని తిరుపతికి చెందిన మల్లికార్జునరావు ఫిర్యాదు చేశాడు. కోర్టుకు వెళితే తనకే సానుకూ లంగా తీర్పు వచ్చిందని తనకు న్యాయం చేయాలని కోరాడు.
` వైసీపీ హయాంలో టీడీపీ నేతలను అసభ్యంగా తిడుతూ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసు అధికారి మల్లికార్జున గుప్తాపై చర్యలు తీసుకోవాలని నంద్యాలకు చెందిన జె.వి.మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.
` గత ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని తమకు న్యాయం చేయాలని ఏపీ సాంస్కృతిక శాఖ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించాలని పలువురు కళాకారులు వేడుకున్నారు.
` బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళితే తన భూమిని ఆక్రమించి దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తన భూమి ఇప్పిం చాలని గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన చల్లగిరి అంకమ్మరావు వాపోయాడు.
` నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ నేతల ప్రోద్భలంతో సీఐ విజయ్‌భాస్కర్, ఎస్సై పి.నాగార్జునలు తనపై అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారని. చిత్రహింసలు పెట్టి వేధించారని నంద్యాల జిల్లాకు పగిడ్యాల మండలం కె.మచ్చుమర్రి గ్రామానికి చెందిన కాటం చిన్ననాగన్న వాపోయాడు. తాను టీడీపీ కోసం పనిచేస్తున్నానన్న కోపంతోనే తనపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని తనపై అక్రమ కేసులను తొలగించాలని వేడుకున్నాడు.
` తన కూతురు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఓ మెడికల్ అకాడమీలో చేరిందని అక్కడ ఫుడ్ పడక జ్వరం రావడంతో మధ్యలో మానుకోవాల్సి వచ్చిందని గుంటూరుకు చెందిన గడ్డం వెంకటేశ్వర్లు తెలిపాడు. అప్పటికే రూ.50,500 ఫీజు కట్టామని.. మొత్తం ఫీజు కడితే కాని సర్టిఫికెట్లు ఇవ్వమని చెబుతున్నారని వాపోయాడు. తన కూతురికి ఎంఈఎస్‌టీ కౌన్సిలింగ్ ఉందని.. డబ్బులు కట్టుకోలేని పరిస్థితి అని కేంద్రమంత్రి రామ్మో హన్‌నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించిన కేంద్రమంత్రి ఆ అకాడమీ నిర్వాహకులకు ఫోన్ చేసి మాట్లాడారు.
` తీసుకున్న అప్పును తిరిగి కడతామని చెప్పినా పోలీసుస్టేషన్‌కు పిలిపించి తన కొడు కును తీవ్రంగా కొట్టి చంపారని అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లికి చెందిన మాదినేని రామంజినమ్మ వాపోయారు. తమ కొడుకు చావుకు కారకులపై పుట్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
` కడప జిల్లా కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామ ఎస్సీ కులస్తులు తమ గోడు చెప్పుకుంటూ శ్మశానం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు పక్కన వంకల్లో శవాలను పూడ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని శ్మశానానికి కేటాయించాలని కోరారు.
` విజయవాడ భవానీపురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు సమస్యలు వివరిస్తూ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీఐఐసీ కేటాయించినా తరువాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదని ఆగిపోయిన ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును ప్రారంభించాలని సంఘ అధ్యక్షుడు మధురాం తకం శ్రీనివాసరావు వేడుకున్నాడు.
పదవుల కోసం పోటెత్తిన నేతలు
అనేక మంది భూ కబ్జా బాధితులతో పాటు పింఛన్లు, ఉద్యోగాలు, చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్ అందించి ఆదుకోవాలని పలువురు వినతులు అందించారు. మరికొందరు చదువు కోసం సాయం కోరారు. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్లు వేడుకున్నారు. తమకు సరైన టైం స్కేల్ వర్తింప చేయడం లేదని నాన్ టీచింగ్ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన నేతలు పదవులను ఆశిస్తూ రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడులకు తమ వినతులు అందించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.