హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఔటీ, ఈడీ సుదీర్ఘ సోదాల అనంతరం కవితను అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. కవిత అరెస్టుపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈడీ అధికారులు ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ – పీఎంఎల్ యాక్ట్ ద్వారా అరెస్టు చేసినట్లు వెల్లడిర చారు. శుక్రవారం సాయంత్రం. 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడిర చారు. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశా మని నోటీసులో పేర్కొన్నారు.
అరెస్టుపై స్పందించిన కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఈడీ అధికారులతో సంపూర్ణంగా సహ కరిస్తామని తెలిపారు.ఈ అరెస్టును అక్రమ అరెస్టు గా అభివర్ణించిన గులాబీ నేతలు న్యాయ పరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదు ర్కొంటామని అన్నారు. కవిత తరలింపు నకు ఆటంకాలు లేకుండా రోప్ పార్టీ ఏర్పాట్లు చేశారు. అరెస్టుని అడ్డుకోవద్దని, పార్టీ కార్యకర్తలు శాంతి యుతంగావ్యవహరించాలని కోరిన కేటీఆర్,హరీష్ రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.
కవిత అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ కుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అరెస్టుపై ఈడీ జేడీ భానుప్రియ మీనాతో కేటీఆర్ కు వాగ్వాదం జరిగింది. దీంతో కేటీఆర్‌కు ఈడీ జేడీ మీనా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ కవితను శంషా బాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్‌కేసులో.. కవిత ఇం ట్లో సుమారు 4గంటలపాటు సోదాలు నిర్వహిం చారు. పలుకీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు. వాస్త వానికి కవితను ఏక్షణమైనా అరెస్ట్ చేస్తారని మధ్యా హ్నం నుంచే వార్తలు వచ్చాయి. కవిత ఇంట్లో అధి కారుల సోదాలు.. ఇంటి బయట పోలీసులు భారీ గా మోహరించడంతో కీలక పరిణామమే జరుగు తుందని అందరూ ఊహించారు. దీనికి తోడు కవిత, ఆమె భర్త అనిల్.. సహాయకుల ఫోన్లుకలిపి మొత్తం 16ఫోన్లను అధికారులు స్వాధీనం చేసు కోవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
అయితే.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకో కుండా నిలువరించాలంటూ సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్ ఈనెల 19న విచారణ ఉండ టంతో.. అంతవరకూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని బీఆర్‌ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢల్లీి నుంచి ఏక కాలంలో ఈడీ, ఐటీ అధికారులు వచ్చి తనిఖీ లు చేయడంతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ ఉలిక్కి పడిరది. ఇప్పుడు కాదు గతంలో ఢిల్లీ వేదికగా ఈడీ విచారణ జరిగినప్పుడే అరెస్ట్ చేయాల్సింది,.. ఆలస్యమైందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీలో కుంభకోణం జరిగినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీలో అధికార ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ రూ.వంద కోట్లు ఇచ్చినట్లు ఈడీ అభియోగం మోపింది. సౌత్ గ్రూప్‌లో కవిత ఉన్నారని పలు సందర్భాల్లో ఈడీ ప్రస్తావించింది. హోల్‌సేల్ డీలర్ ఇండో స్పిరిట్‌లో కవిత భాగ స్వామి అని, ఆదాయంలో 6శాతాన్ని ఆప్ నేతలకు ముడుపులిచ్చేలా కుట్రపన్నారని ఈడీ చెబుతోంది.