చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి టిడిపి నాయకుడు మహేశ్వర్‌రెడ్డికి చెందిన భూముల్లో వైసిపి నాయకులు ప్లాట్లు నిర్మించడం పట్ల టిడిపి నాయకులతో కలిసి బీటెక్ రవి సమస్యాత్మక ప్రాంతాన్ని పరిశీలించి వైసీపీ నాయకుల తీరుపై ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ నాగులగుట్ట పల్లె టిడిపి మండల నాయకుడు మహేశ్వర్ రెడ్డికి చెందిన భూమిపై ఇప్పటికే లక్కిరెడ్డిపల్లి స్టేషన్ నందు మరియు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ పలు పంచాయతీల అనంతరం మహేశ్వర్ రెడ్డి రెండు కోట్ల 80 లక్షలకి కొనుగోలు చేసి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందని కానీ వాటికి విరుద్ధంగా నేడు వైసిపి నాయకులు నేడు భూమిలో ఫ్లాట్ నిర్మించి విక్రయాలకు పాల్పడం సరికాదని సమస్యలు ఏమైనా ఉంటే పెద్దమనుషుల పంచాయతీ ద్వారా సర్ది చేసుకోవాలి తప్ప శాంతి భద్రత సమస్యలు తలెత్తేలా ఇలా అక్రమాలకు పాల్పడడం సరికాదని ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగితే టిడిపి మద్దతు దారులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఈ వివాద స్థలంలో ఎలాంటి క్రయ విక్రయాలకు ప్రజలు పూనుకోకూడదని అలా కాదని ఎవరైనా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.