కడప: టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి ని కడప జిల్లా వల్లూరు పోలీసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది నెలల క్రితం 10 నెలల క్రితం యువగళం ప్రారంభానికి ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప నగరానికి వచ్చిన సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆందోళన చేసి, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని
బీటెక్ రవిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. గన్ మెన్లు, డ్రైవర్ ను వదిలేసి బీటెక్ రవిని వల్లూరు స్టేషన్‌లో ఉంచి, తరువాత కడపకు తరలించారు. మంగళవారం రాత్రి పులివెందుల నుంచి కడప వస్తుండగా బీటెక్ రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న రవి సతీమణి భయాందోళనకు గురై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రవికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు తెలియదని పోలీసులు చెప్పటంతో.. రవిని తీసుకెళ్లిందెవరు.. అసలేం జరిగింది..అనేది తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ ఘటనపై హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. అయితే తరువాత రవి ని తామే అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కడప సమీపంలో వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాగా బీటెక్ రవికి ఏం జరిగినా సీఎం, పోలీసులదే బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.