.విశాఖ ఆదాయంపై విజయసాయి వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్
అమరావతి: ఇప్పటి వరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బుర్ర అరికాల్లో ఉందనే అనుమానం ఉండేదని, విశాఖ ఆదాయంపై ఆయన చేసిన ట్వీట్ చూసిన తరువాత బుర్ర తక్కువవాడని తేలిపోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. విశాఖ జీడీపీ విషయమై విజయసాయిరెడ్డి ట్విటర్లో చేసిన వ్యాఖ్యలకు ఆయన గురువారం ట్విటర్లోనే కౌంటర్ ఇచ్చారు. విశాఖ అభివృద్ధిపై నాడు టీడీపీ దృష్టి పెట్టి ఉంటే జాతీయస్థాయిలో ఐదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు వైసీపీ వచ్చాక విశాఖ అభివృద్ధి పథంలో పయనిస్తోందని విజయసాయి చేసిన ట్వీట్‌కు బుద్ధా వెంకన్న స్పందించారు. 2016-17లోనే విశాఖ జీడీపీ 43.5 బిలియన్ల యూఎస్ డాలర్లుగా ఉందని బుద్ధా వెంకన్న వెల్లడిరచారు. ఇప్పుడున్న ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే మీరు పెంచినట్లా? తగ్గించినట్లా? అనేది నీ దొంగ సీఏ మెదడుతో ఆలోచించమని విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న సలహా ఇచ్చారు.