చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వచ్చే మహిళా దినోత్సవం నాటికి..లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలు

ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Aug 27, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వచ్చే మహిళా దినోత్సవం నాటికి..లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీజన్‌లోనే రైతులకు రుణాలివ్వాలి
  • తరువాత ఇచ్చినా నిరుపయోగమే
  • ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ
  • బలహీన వర్గాలకు బాసటగా ఉండాలి
  • నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక తోడ్పాటునివ్వండి
  • అమరావతిలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు
  • లాజిస్టిక్స్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తాం… సహకరించండి
  • పీ4లో బ్యాంకర్లు భాగస్వామ్యులవ్వాలి
  • ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి (చైతన్యరథం): వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూయర్‌ విధానంలో భాగంగా లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన జరగబోయే మహిళా దినోత్సవం నాటికి లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దినట్లుగా ప్రకటన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని… దీనికి బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్‌ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఏయే రంగాల్లో సహకారం కావాలనే అంశాన్ని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..గతంలో వన్‌ ఫ్యామిలీ… వన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటూ ప్రమోట్‌ చేశాం. ఇప్పుడు వన్‌ ఫ్యామిలీ… వన్‌ ఎంటర్‌ ప్రెన్యూయర్‌ అనే నినాదంతో పని చేస్తున్నాం. దీంట్లో భాగంగా మహిళలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించాం.

వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ నాటికి లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్దం చేశాం. దానికి బ్యాంకర్లు సహకరించాలి. బ్యాంకులు అందించే సహకారాన్ని అందుకుని ఏపీ డ్వాక్రా మహిళలు ప్రగతి పథాన నడుస్తున్నారు. ఇప్పటికే మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతున్నారు. వారికి మరింత తోడ్పాటు ఇచ్చే విధంగా వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ ప్రెన్యూయర్‌ విధానాన్ని వారికి వర్తింప చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో వీలైనంత మేరకు మహిళలకు అవకాశం ఇస్తాం. డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు ఏ విధంగా సహకరించారో.. దీనికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

ఇన్నోవేషన్‌ కేంద్రాలకు… బ్యాంకర్లు అనుసంధానమవ్వాలి
యువత, మహిళ పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేలా రాష్ట్రంలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించాం. ఇప్పటికే అమరావతిలో ప్రధాన కేంద్రం పనిచేయడం మొదలైంది. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి వంటి చోట్ల ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వీరికి నాలెడ్జ్‌, ఎడ్యుకేషన్‌ పార్టనర్లు ఉంటారు. దీనికి బ్యాంకర్ల నుంచి సహకారం ఉండాలి. ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే ఇన్నోవేషన్‌ హబ్‌లకు ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల ప్రతినిధులను అనుసంధానించాలి. ఇది స్టార్టప్‌లకు, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణలకు సహకారం అందించే దిశగా ఆలోచనలు చేయాలి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను, విదేశీ విద్యను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. యువత భవిష్యత్తు బంగారుమయం కావాలంటే విద్యకు ప్రాధాన్యమివ్వాలి. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు… ఉన్నత విద్య, విదేశీ విద్యను పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఉన్నత విద్యకు సహకరించేలా బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషించాలి. తక్కువ వడ్డీలతో రుణాలివ్వడం.. తక్కువ మొత్తాలతో అప్పు తీర్చే వెసులుబాటు కలిగించాల్సిన అవసరం ఉందని సీఎం వివరించారు.

ప్రజల కోసం… పేదల కోసం…
‘‘బ్యాంకర్ల సమావేశాలు అర్థవంతంగా జరగాలి. ఫలితాలిచ్చేలా ఉండాలి. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. రోటీన్‌ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఖరీఫ్‌ సీజన్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీజన్‌ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రస్తుతం ప్రపంచం అంతా వేగంగా మారిపోతోంది. బ్యాంకర్లూ మారాలి. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చింది. నెక్స్‌ట్‌ జనరేషన్‌ ఆఫ్‌ రిఫార్మ్స్‌ రావాలి. బ్యాంకులు, పబ్లిక్‌ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించేలా కాకుండా… ప్రొత్సహించేలా ఉండాలి. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోంది. ఫాల్స్‌ లెండిరగ్‌ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరు, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావు. పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలనూ చేపట్టాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం పీ4 కార్యక్రమం చేపట్టింది. ఇందులో బ్యాంకర్లూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు.

రవాణా రంగానికి ఆసరాగా నిలవండి
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా చేపడుతున్నాం. పెద్ద ఎత్తున లాజిస్టిక్స్‌ ప్రాజెక్టులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, అన్ని రకాల రవాణా సౌకర్యాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. దుగరాజపట్నం పోర్టు రాబోతోంది. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఏపీకి అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. లాజిస్టిక్స్‌ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. లాజిస్టిక్స్‌ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు లాజిస్టిక్స్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. లాజిస్టిక్స్‌ వ్యయం ప్రస్తుతం 14 శాతంగా ఉంది. లాజిస్టిక్స్‌ వ్యయం సింగిల్‌ డిజిట్‌కు తగ్గించేలా ఇన్ఫ్రా ప్రాజెక్టులు రావాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కల్పనలో పీపీపీ పద్దతిలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. అవసరమైతే దీనికి వయబులిటి గ్యాప్‌ ఫండిరగ్‌ ఇస్తాం. దీనికి ఐఐఎఫ్సీఎల్‌ వంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకర్లు సహకరించాలి. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఫండిరగ్‌ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు.

అమరావతిలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌
ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకులన్నీ కలిసి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయండి. క్యాంటం వ్యాలీ సేవల్ని కూడా వినియోగించుకోండి. ఆర్థిక లావాదేవీల భద్రత ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్వాంటం వ్యాలీ సేవలు ఉపకరిస్తాయి. అమరావతిలో ఐకానిక్‌ భవనాలు నిర్మించండి. బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తాం. రెండేళ్లలో అమరావతిలో బ్యాంకులు తమ కార్యాలయాలను నిర్మించాలి. బ్యాంకుల బ్యాక్‌ ఎండ్‌ సర్వీసులను ఇక్కడి నుంచే అందించాలి. అమరావతిలో రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మందుకు రావాలి. వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దమని సీఎం చంద్రబాబు సూచించారు.

బడుగులకు అండగా ఉండాలి
కౌలు రైతులకు రుణాలివ్వాలి. బడుగులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. వారికి ఆర్థికపరమైన అండ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు.. బ్యాంకర్లు కూడా సహకరించాలి. బీసీ కార్పొరేషన్‌, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన క్లియర్‌ చేయాలి. పీఎం సూర్యఘర్‌ వంటి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించాం. దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలి. సిబిల్‌ స్కోర్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. దీన్ని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోవాలి. స్టార్టప్‌ ఇండియా, ముద్రా యోజన, పీఎంఈజీపీ, ఎఫ్‌ఎంఈ, స్వానిధి పథకాల్లో బడుగులకు ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.

వివిధ రంగాల్లో రుణాలిలా…
232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వివిధ రంగాలకు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను వివరించారు. పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఎంత వరకు పురోగతి సాధించారనే అంశంపై సమీక్షించారు. మొత్తంగా వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా అన్ని రంగాలకు కలిపి రూ. 2,47,919 కోట్ల మేర రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఇందులో వ్యసాయ రంగానికి రూ.94,666 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.49,831 కోట్లు, ఇతర రంగాలకు రూ. 1,00,278 కోట్ల మేర రుణాలను ఇచ్చారు. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని మంజూరు చేశారు. ఆర్థిక ప్రమాణాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బ్యాంకులు బాగా పని చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజు చెప్పారు.. సేద్యానికి ముందుగానే రైతులకు రుణ వితరణ జరగాలన్న సీఎం అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్‌ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో పార్కు, మెమోరియల్‌ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయిస్తే ఆ పనులు పూర్తి చేస్తామని నాగరాజు ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్బీసీ ఛైర్మన్‌ నితీష్‌ రంజన్‌, సీడ్బీ సీఎండీ మనోజ్‌ మిట్టల్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఎండీ హర్ష బంగారి, కెనరా బ్యాంక్‌ ఎండీ సత్యనారాయణ రాజు, పంజాబ్‌ నేషనల్‌ ఎండీ అశోక్‌ చంద్ర, ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ బినోద్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

మహోన్నత మానవతావాది మదర్‌ థెరెసా

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 27-08-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist