.3.25 లక్షల మందికి సంబంధించిన సీపీఎస్ రద్దు చేయాలి
.జగన్ ప్రభుత్వం కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
అమరావతి: తన అధికారాన్ని ఉపయోగించి ఉద్యో గస్థులపై అక్రమ కేసులు పెట్టి సెప్టెంబరు 1న జరగాల్సిన ‘చలో సీఎం క్యాంపు ఆఫీస్’ కార్యక్ర మాన్ని ప్రభుత్వం రద్దు చేయించి, వాయిదా వేయించడం అన్యాయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల యంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ను వారంలోగా రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు రద్దు చేయ లేదన్నారు.
సీపీఎస్ రద్దుకు ప్రత్నామ్యాయంగా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాల్సింది పోయి ఉద్యోగులపై కేసులా అని మండిపడ్డారు. మాట తప్పి మడమ తిప్పినందున తన చేతకాని తనాన్ని ఒప్పుకోవాలన్నారు. బలం ఉంది కదా అని ఉద్యోగస్థులపై పోలీసుల ద్వారా పశుబలం ప్రయోగించడమేంటని ప్రశ్నించారు. ఉద్యమ కార్య క్రమంలో పాల్గొన్న ఉద్యోగస్థులకు పోలీసు నోటీసులు ఇస్తే రూ.2 లక్షలు కట్టాల్సి ఉంటుందని బాండ్లు రాయించుకోవడం అన్యాయమన్నారు. అరెస్టులు చేసి రిమాండ్ కి పంపిస్తామని బెదిరించడం మరీ అన్యాయమని పేర్కొన్నారు. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. మమతా బెనర్టీ, సీపీఐ నాయ కత్వంలో రోడ్ల మీద కొట్టు కున్న సందర్భాలు కూడ ఉన్నాయని, అప్పుడు మమతా బెనర్జీ ఇంత దారుణమైన సెక్షన్లని వాడలేదన్నారు.
గతంలో ఎన్నడూ ఇంతటి అణచివేత చూడలేదు
గతంలో తాము అనేక ఉద్యమాలు చేశామని, చూశామని, ఉద్యమం అణచివేత ఈ విధంగా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఉద్యమాలు చేసిన వారిని డిస్మిస్ చేశారని, ఉద్యమ సంఘ నాయకులను అరెస్ట్‌లు చేశారని, ఉద్యోగస్తుల ఉద్యమాన్ని అణచేందుకు ఇంతమంది పోలీసు ఫోర్స్‌ని వాడటం ఎప్పుడూ చూడ లేదని చెప్పారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి హామీ నేరవేర్చనందున సాధ్యసాధ్యాలు తెలుసుకోకుండా చెప్పానని ఉద్యోగ సంఘాలకు క్షమాపణ కోరాలని చెప్పారు. ఇది 3 లక్షల 25 వేల మంది సీపీఎస్ ఉద్యోగస్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాల రద్దుకు బెదిరింపులు
ఉద్యమాలను రద్దు చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఉద్యోగ సంఘాలను భయపెడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమం కూడా కొన్నాళ్ళు చల్లబడి తరువాత క్విట్ ఇండియాతో బ్రిటిష్ ప్రభుత్వం కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం కూడ కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మాట తప్పడమే కాకుండా ప్రశ్నించే వారిని శిక్షించే స్థాయికి ప్రభుత్వం వెళ్లగలదని, ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రి.. పోలీసు వ్యవస్ధ, అధికారం ఉన్నాయని అహంకారంతో ఉద్యోగస్థులను బెదిరించొచ్చని, కానీ రాబోయేది ప్రజా సంగ్రామమని, అక్కడ ఎవరినీ బెదిరించలేరని హెచ్చరించారు.
జీపీఎఫ్ రూ.414 కోట్లు వాడుకున్న ప్రభుత్వం
ఉద్యోగస్థుల జీపీఎఫ్ రూ.414 కోట్లు ప్రభుత్వం వాడుకుందని లోక్‌సభలో ఆర్థిక మంత్రి చెప్పినట్లు తెలి పారు. ఉద్యోగస్థులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని,ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలిపి గతంలోఉన్న ప్రయోజనాలను కొనసాగించలేదని మండిపడ్డారు. శిశుపాలుడు వంద తప్పుల్లాగా జగన్‌రెడ్డి పాపాల చిట్టాకి కూడా సరైనసమయం వస్తుందని హెచ్చరించారు.ఉద్యో గస్థులు కాళ్లతో, చేతులతో సమాధానం చెప్పేరోజులు వస్తాయన్నారు. గతంలో రాజకీయ నాయకులను ఓడిస్తామన్న ఉద్యోగ సంఘాలు నేడు లేకపోయినప్పటికీ.. ప్రత్యామ్నాయ ఉద్యోగ సంఘాలు ఉన్నాయని చెప్పారు. ఉద్యోగుల మనస్తత్వాన్ని ప్రభుత్వం ఎందుకు తెలుసు కోలేకపోతుం దని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సలహా ఇచ్చారు. 27శాతం ఐఆర్ ఇస్తే, 32శాతం కావా లని అడిగారని, అయితే 23 శాతం మాత్రమే ఇచ్చారని చెప్పారు. నష్టపోయినా ఉద్యోగులు సరిపెట్టుకున్నారన్నా రు.జగన్‌రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి కాదని, ఇదేమి రాచరికపాలన కాదని గుర్తుంచుకోవాలని చెప్పారు.10 శాతం ఉద్యోగస్థులు కూడా సంతృప్తికరంగాలేరని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.