- సినీనిర్మాతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే విలువ కలియుగ దైవానికి ఇవ్వరా?
- మూడున్నరేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా వెళ్లే తీరిక లేకపోయిందా?
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకచోటకని బయలుదేరి మార్గమధ్యంలో వేరేచోటకు వెళ్లడం కొత్తేమీ కాదు. తిరుమల పర్యటన కోసమని మంగళవారం బయల్ధేరిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి నేరుగా తిరుపతి వెళ్లకుండా బేగంపేట వెళ్లారు.అక్కడ భారతిరెడ్డిని దించి అక్కడ నుంచి ఒంటరిగా సిఎం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై భారతిరెడ్డికి, జగన్ కుటుంబానికి మొదటి నుంచి గౌరవం లేదు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటపుడు దంపతులిద్దరూ కలిసి ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి మూడే ళ్లుగా మంటగలుపుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో, అది కూడా ప్రభుత్వ ఖర్చుతో గన్నవరం నుంచి తిరుమలకు బయలుదేరిన జగన్ ఆకస్మికంగా తమ రూటు మా ర్చి బేగంపేట టెర్మినల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు తన సతీమణి భారతీరెడ్డిని లోటస్ పాండ్‌లో దించడానికి సమయం ఉంది కానీ భార్యతో కలిసి తిరుమల వెళ్లడానికి సమయం లేకపోయింది. ముఖ్య మంత్రి దంపతులు VTARO Airways Dassult falcon 2000మోడల్ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ బేగంపేట టెర్మినల్‌కు చేరు కున్నారు. అక్కడ నుంచి భారతీరెడ్డి లోటస్ పాండ్ కు వెళ్లిపోగా ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే హైదరాబాద్ నుంచి అదే విమానంలో రేణిగుంట చేరుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఒంటరిగా తిరుమల వెళ్లారు. సిఎం స్థానంలో ఉన్న నేత వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను పక్కనబెట్టి ఏదేని ప్రార్థనాస్థలానికి వెళ్లేటప్పు డు అక్కడి మతవిశ్వాసాలను, ఆచారాలను గౌరవిం చాల్సి ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రజ లకు మేలు జరగాలని ముందుగా గంగమ్మ ఆలయం లో పూజలు నిర్వహిస్తారు, కానీ దాన్ని కూడా తుంగ లో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించటం వల్లే ప్రజ లు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సినీ నిర్మాతలు, సినీనటులు వచ్చినపుడు సతీసమేతంగా కలిసి వారితో భోజనంచేసే జగన్‌రెడ్డి దంపతులు.. బ్రహ్మోత్సవాల కు వెళ్లేందుకు మాత్రం గత 40నెలల్లో వారికి వీలు లేకపోయింది.ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్కసారి కూడా ఇంతవరకు సతీసమేతంగా తిరుమల బ్రహ్మో త్సవాలకు హాజరుకాలేదు. ఉగాది, సంక్రాంతి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వేదపండితులు, అర్చకు లు వెంకటేశ్వరస్వామి ప్రసాదం తీసుకుని ముఖ్యమం త్రి దంపతులను నివాసానికి వెళ్లి ఆశీర్వదించి ఆహ్వా నించే సమయంలో కూడా ఒక్కసారి కూడా భారతి రెడ్డి హాజరు కాలేదు. తిరుమల విషయంలో కోట్లాది మంది హిందూ మత విశ్వాసాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదేపదే అవమానిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి స్థానంలో ఉన్న సిఎం అన్నిమతాలను సమదృష్టితో చూస్తూ వారివారి విశ్వా సాలను గౌరవించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోంది. ఖైదీ సినిమాలో చిరంజీవి కోటిపల్లికి దారి అడిగి కొండపల్లికి వెళ్లిన చందంగా ముఖ్యమంత్రి జగ న్ రెడ్డి తాను వెళ్తున్నట్లుగా చెప్పినచోటకు నేరుగా వెళ్లే అలవాటు లేదు. గతంలో దావోస్ కని బయలుదేరి వ్యక్తిగత పనులకోసం లండన్‌వెళ్లి ఆయన మీడి యా కు చిక్కినవిషయం రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే.తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి కారణమైన కోట్లాదిమంది హిందూభక్తుల మనోభావాలను కూడా జగన్ రెడ్డి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.