యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసునామీని ఆపలేరన్నారు. అధికార అహంతో విర్రవీగే ప్రభుత్వ కుట్రలను ఛేదిస్తామన్నారు. సభకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ నిరాకరిస్తోంది. ఏయూ కళాశాల ప్రాంగణం ఇచ్చేందుకు వీసీ అనుమతివ్వట్లేదని చినరాజప్ప విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిమంది ప్రజలు తరలివస్తున్నారన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేలను కాదు.. సీఎంను మార్చినా ఉపయోగం లేదన్నారు.