– పశుసంపదను, ప్రజలను కాపాడండి
టెక్కలి, చైతన్యరథం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, ఇచ్ఛాపు రం నియోజకవర్గాల్లో తిరుగతూ ప్రజ లను భయభ్రంతులకు గురిచేస్తూ పశు సంపదకు నష్టం కలుగుజేస్తున్న పెద్ద పులిని వెంటనే పట్టుకోవాలని కోరుతూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యుడు కె.అచ్చెన్నాయుడు గురువారం లేఖ రాశారు. టెక్కలి నియోజక వర్గంలోని టెక్కలి మరియు నందిగాం మండలాల్లో, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పెద్దపులి తరుచుగా సంచరిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తుందని, తక్షణం పెద్దపులిని పట్టుకొని ప్రజల ప్రాణాలకు, పశుసంపదకు రక్షణ కల్పించాలని కోరారు. అటవీశాఖ అధి కారులు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతానికి ప్రాణనష్టం లేకుండా చూస్తున్నారని అన్నారు. కానీ వ్యవసాయ పనులు జరు గుతున్న ప్రస్తుత తరుణంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయపడుతున్నారని, వెంటనే నిపుణులను పిలిపించి జాగ్రత్తగా పెద్ద పులిని పట్టుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.