- ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఏపీపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు
- ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులుపై కేసు నమోదు చేయాలి
- సర్వీస్ కమిషన్ను జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడు
- లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
- ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారు
- రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి సీఎం జగన్రెడ్డి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ,మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బల యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని..వాటికి కారణాలు ఏంటో బహి ర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాం కనం, మాన్యువల్ మూల్యాంకనం అంటూ మోసపూరి త చర్యలతో రాజకీయ మూల్యాంకనానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తమవారిని పోస్టింగుల్లో కూర్చో బెట్టుకు నేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశా రన్నారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునారావాస కేంద్రం గా మార్చి… అక్రమాలకు పాల్పడడమే కాకుండా హైకోర్టును సైతం మూల్యాంకనం విషయంలో తప్పు దోవపట్టించే ప్రయత్నం చేయటం విస్మయం కలిగిం చిందనన్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న సర్వీస్ కమిషన్ పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్, సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల అక్రమాల వల్లనే పరీక్షల రద్దు జరిగిం దన్నారు. సీబీఐ విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్రతో పాటు ప్రభుత్వ పెద్దల అక్రమాలు కూడా బట్ట బయలు అవుతాయన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అటు జాబ్ క్యాలెండర్ రాక, ఇటు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత, తాజా అక్రమాలతో పూర్తిగా నిస్పృహలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని, వారి ఆశలను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని ఒక ప్రకటనలో చంద్రబాబు దుయ్యబట్టారు.