నారావారిపల్లె: నిజాలకు ప్రతి రూపం చంద్రబాబు అయితే అబద్దాలకు ప్రతి రూపం జగన్ అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. నారావారిపల్లెలో అనిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజాపై మండిపడ్డారు. తిరుమలకు వెళ్లిన నారా భువనేశ్వరి తిరుమలలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. తన భర్తతో, వేంకటేశ్వరస్వామితో తనకు ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే మంత్రి రోజా తిరుమలకు వెళ్లి దేవుడి ఆలయం ముందు నుంచి రాజకీయాలు మాట్లాడి తన గొయ్య తానేతవ్వుకున్నారు. వెంకన్నతో ఆటలు ఆడుకుంటే భవిష్యత్తు ఉండదు. తిరుమల గాలి తగిలి తేనే పవిత్రమైన చైతన్యం వస్తుంది. రోజాకు ఎందుకు అలా లేదు అంటే… ఆమెకు వసూళ్లపైనే ప్రేమ కాబట్టి. ఆమె తిరుమలకు వెళ్లిన ప్రతిసారీ ముప్పై టిక్కెట్లు అమ్ముకుంటుందట. చికెన్ కొట్టు వాడి నుంచి కిరాణాకొట్టు, మార్బుల్ కొట్టు వరకు ఎవరిని వదలకుండా మామూళ్లు తీసుకుంటోంది. నువ్వు చేస్తున్న చిల్లర వ్యాపారంపైన సీబీఐ విచారణ చేయిద్దాం. రోజా నియోజకవర్గ పరిధిలోని నిండ్రలో ఎర్రమట్టి అమ్మకాలపై కూడా సీబీఐ విచారణచేయాలి. రోజా గంజి స్టేజీ నుంచి ఇప్పుడు బెంజి కథ వరకు రాష్ట్రంలో అందరికీ తెలుసు. రోజా చేతివాటం ట్రస్టుపెట్టింది. ఆమె చేతివాటం డబ్బులను ఆ ట్రస్టులో వేస్తోంది. పవన్ కల్యాణ్, లోకేశ్ ఒక ఫ్రేమ్‌లో కన్పిస్తేనే ఇలా వణికి పోతున్నారు. వారు ఇద్దరు రంగంలోకి దిగితే ఇక వైసీపీ పరిస్థితిఏమిటని అనిత వ్యాఖ్యానించారు.