- పొత్తు కోసం మూడు పార్టీల త్యాగాలు
- ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడితీరాలి
- టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, చైతన్యరథం: వైఎస్ జగన్‌రెడ్డి విధ్వంస పాలనతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని తిరిగి నిల బెట్టేందుకు, ప్రజలను గెలిపించేందుకే రానున్న ఎన్ని కల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నా యని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అరాచక పాలన కారణంగా రాష్ట్రంలో ఏ వ్యవస్థా సక్రమంగా లేదని,రైతులు, యువత, కార్మికులు, మహి ళలు, నిరుద్యోగలు ఇలా అన్నివర్గాలూ నలిగి పోయా యని, ఈ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్గించేం దుకు ప్రజా హితం కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసం లో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పొత్తులో ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువా కాదని, సమాజ ప్రయోజనాలను పరిరక్షించేందుకు, భవిష్యత్ తరాల కోసం మూడుపార్టీలూ త్యాగం చేశాయని చెప్పా రు.
జగన్‌రెడ్డి పాలనలో సర్వం ధ్వంసమైన రాష్ట్రాన్ని పున:నిర్మించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, గత పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికా రంలో ఉందని, మళ్లీ బీజేపీనే గెలుస్తుందని అంటున్నా రని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని, కేంద్రం నుండి సహకారం అం దాలని, అప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగల మని అన్నారు. రాష్ట్రానికి నిధులు కావాలన్నా, ప్రాజెక్టు లు కావాలన్నా, గ్రాంట్స్ కావాలన్నా, అనుమతుల కావాలన్నా కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఎన్డీయేలో పాత భాగాస్వాములమే!
తాము కొత్తగా ఎన్డీయేలో చేరలేదని, వాజ్‌పేయి కాలం నుండే ఎన్డీయే కూటమిలో భాగాస్వాములుగా ఉన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధానిగా వాజేపేయి ఉన్న కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో వినూత్న విధానాలకు శ్ర్రీకారం చుట్టామని, ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం పొందామని చెప్పారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న 2014`19 కాలంలోనూ తమ పార్టీ ఎన్డీయేలో భాగాస్వామిగా ఉందని, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్, ఎన్‌ఐటి, ఐఐటి, ఐసర్ లాంటి కేంద్ర సంస్థల ఏర్పాటుకు నిధులు ఇచ్చారని, కేంద్ర సహకారంతోనే పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
బీజేపీ అమరావతి రాజధానికి అనుకూలంగా ఉందని, రాజధాని కోసం 2,500 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసిందని, ఇంకా ఎక్కువ కావాలని అడిగామని చెప్పారు. రాజధాని రైతుల కోసం అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కెపిటల్ గెయిన్స్ పన్ను నుండి మినహాయింపు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. తాము ప్రత్యేక హోదా కావాలని కోరితే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటి జగన్‌రెడ్డి ప్రభుత్వం… కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేదని, ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకొచ్చింది లేదని అన్నారు. విభజన హామీల్లో తమ ప్రభుత్వం ఉన్నప్పడు వచ్చినవే తప్ప జగన్‌రెడ్డి ఒక్కటి కూడా కొత్తగా సాధించింది లేదని అన్నారు. తమ వ్యక్తిగత పనులు చేయించుకునేందుకే జగన్‌రెడ్డి కేంద్రం చుట్టూ తిరిగారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. సీట్లు రాని ఆశావాహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని, కేంద్ర, రాష్ట్రంలోనూ అవకాశాలు ఉంటాయని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని చెప్పారు.
బట్టబయలయిన సజ్జల బ్రోకరిజం
తనకు సొంత పత్రిక లేదు అని జగన్ అంటాడని, ప్రతి రోజూ సాక్షి పత్రికలో అబద్ధాలే రాయిస్తాడని అన్నారు. రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ‘‘అమరావతిని విధ్వంసం చేశారు. పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు…నిధులు సద్వినియోగం చేసుకోలేదు. అడిగిన వారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు. కేసులు పెడతారు, భయపెడతారు, మాకెందుకు అని నిస్సాహయాతతో ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకోలేరు.
సిద్ధం సభలకు బస్సులు పెడుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారు. దీంతో 30ఏళ్లు రాష్ట్రం వెనక్కివెళ్లి పోయింది. దీన్ని పునర్నిర్మించాలంటే కేంద్రం సాయం అవసరం.
విధ్వంసాలు చేసేవాళ్లు రాజకీయాలకు అనర్హులు. అన్ని రంగాల వారు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు. నేను వేసిన పునాదికి నా తర్వాత వచ్చిన వారు అడ్డకుట్ట వేసి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి అయ్యేది కాదు. అమరావతి నిర్మించి, పోలవరం పూర్తి చేసి ఉంటే నేడు మనం మంచి స్థితిలో ఉండేవాళ్లం. మనం భూములు కేటాయించడం వల్ల అమరావతిలో అంతర్జాతీయ విద్యా సంస్థలైన విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత్ యూనివర్సిటీలు వచ్చాయి. ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాల్సిందే. చిలకలూరిపేట నుండి మంత్రి రజినీని ట్రాన్స్ ఫర్ చేశారు. మల్లెల రాజేశ్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతని దగ్గర మంత్రి రజినీ 6.5 కోట్లు డబ్బులు తీసుకున్నారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకరిజం చేశాడు. మళ్లీ అతన్ని మార్చి కావటి మనోహర్‌ను పంపాడు. దీంతో నా డబ్బుల కథ ఏంటని రాజేష్ నాయుడు అడుగుతున్నాడు. ఇలాంటి రాజకీయాలు ఊహించారా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
యువత రోడ్లపైకి రావాలి
రాష్ట్రంలో ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాల్సిందేననన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే ప్రతి వ్యక్తి, తన వ్యక్తిగత వృద్ధిని కాంక్షించే ప్రతి మనిషీ రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారం నుండి దించి టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. జగన్‌రెడ్డి బెదిరింపులకు భయపడకుండా, తప్పుడు కేసులకు బెదరకుండా రాష్ట్ర యువత అంతా వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఇప్పటికైనా రోడ్లపైకి రావాలని కోరారు. రౌడీయిజం చేసి, బూతులు స్వాధీనం చేసుకొని, రిగ్గింగ్ చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని, దీన్ని తమ కూటమి ఎదిరించి నిలబడుతుందని, తమతోపాటు రాష్ట్రంలోని యువత అంతా కూడా కలిసి రావాలని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగకుంటే ఇక యువతకు భవిష్యత్తే ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ప్రధాని మోదీ చెప్పినట్లు 2047నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుం దని, దీనిలో ఎటువంటి సందేహాం లేదని అన్నారు. సర్వీసు రంగంలో ముందున్న భారతీయులు ప్రపంచ నలుమూలలకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఆయా దేశాల్లో రాజకీ యంగా కీలక స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు. ఏ దేశంలోనైనా ఇమడగల మనస్తత్వం భారతీయులకు ఉందని, ప్రపంచం మొత్తానికి భారతీయులపై నమ్మకం ఉందని, అందులోనూ తెలుగు ప్రజలు అందరికంటే అధికంగా యువపారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నా రని చెప్పారు. 1991లో పివీ నరిసింహారావు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు దేశానికి శ్రీరామరక్షగా మారాయని, ఈ ఆర్ధిక సంస్కరణల వల్లే సంపద సృష్టి జరిగిందని అన్నారు. అయితే సంపద కొద్ది మంది వద్దే కేంద్రీకృతం అవుతోందని, పేదిరకం పెరుగుతుందని, ఈ రకమైన అసమానతలను నివారించేందుకే తాను పీ4 సూత్రాన్ని ప్రకటించానని, ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లు అట్టడుగున్న ఉన్నవారిని ఆదుకునే విధంగా, వారిని పేదరికం నుండి బయటపడే విధంగా పీ4 పథకం అమలు ఉంటుందని చంద్రబాబు చెప్పారు.