- ఈనెల 8న మరోసారి భేటీకి నిర్ణయం
అమరావతి, చైతన్యరథం: రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయంలో భాగంగా వివిధ అంశాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఆదివారం నాడు సుదీర్ఘంగా చర్చలు సాగాయి. వీరిద్దరూ రెండు దఫాలుగా భేటి అయ్యారు. ఎవరె న్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశాల తోపాటు ఉమ్మడిమేనిఫెస్టో,ఉమ్మడి సభలపైన చర్చలు జరిపారు. ఈనెల 8వ తేదీన మరోసారి భేటి అయి పొత్తుపై మరింత స్పష్టతకు రావాలని నిర్ణయించారు.
రెండు దఫాలుగా చర్చలు
ఆదివారం నాడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రెండు దఫాలుగా భేటి అయ్యారు. మధ్యాహ్నం మూడు గంట ల ప్రాంతంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఇద్దరూ భేటి అయ్యి చర్చలు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఈ చర్చలు సాగాయి. అనంతరం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎంపీ బాలశౌరీ తన పార్టీలో చేరే కార్యక్రమంలో పాల్గొ న్నారు. నేటి నుండి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇద్దరు మళ్లీ రాత్రి 9.30 గంటల తిరిగి భేటి అవ్వగా గంట సేపట్లో ముగిసింది. పొత్తుకు ముందుకు తీసుకుపోవటంలో భాగంగా ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ భేటి అయి చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ చర్చలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపైనా చర్చలు
సీట్ల సర్దుబాటుతోపాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకట న, ఉమ్మడి సభల నిర్వహణపైన కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. రాజమహేంద్రవరం లో జరిగిన మహానాడులో టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్ అనే ఆరు పథకాలతో సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రకటించింది. వీటిని ఇప్పటికే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసు కెళ్తున్నాయి. మరోవైపు జనసేన షణ్ముఖ వ్యూహాం పేరుతో కొన్ని పథకాలను ప్రతిపాదించింది. ముఖ్యంగా యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల రుణ సహాయం అందించే పథకం, మత్య్యకారులకు ప్రత్యేక పథకం, మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు పేరుతో కొన్ని పథకాలను ప్రచారంలో పెట్టింది.
ప్రస్తుత చర్చ ల్లో రెండు పార్టీలూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను ఎలా రూపొందించాలి, ఇప్పటికే ప్రకటించిన హామీలు కాక, కొత్తగా ఏమి ప్రకటించాలి అనే విషయాలపై చర్చిం చారు. దీనిపై కూడా దాదాపు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు ఉమ్మడిగా సభలు నిర్వహించడంపై కూడా ఇరు అధినేతలు చర్చించారు. ఇప్పటికే యువగళం పూర్తయిన సందర్భంగా యువ గళం నవశకం పేరుతో విజయనగరం జిల్లాలో నిర్వ హించిన సభలో ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించా లని ఈ భేటిలో అంగీకారానికి వచ్చారు.