అమరావతి: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 16 (గురువారానికి)వ తేదీకి వాయిదా పడిరది. సీఐడీ తరపున ఏఏజీ పొన్నువోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మిగిలిన వాదనలు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామంటూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై బుధవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీంతో, విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది. మధ్యాహ్నం కూడా వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ వాయిదా వేశారు.
అసైన్డ్ భూములపై విచారణ రెండు వారాలు వాయిదా
అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంపై దాఖలైన 9 పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. మాజీమంత్రి నారాయణతో పాటు మరికొంత మంది దాఖలు చేసిన 9 క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
బండారు సతీమణి పిటిషన్‌పై విచారణ 27కి వాయిదా
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సతీమణి పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని బండారు సతీమణి హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సీసీ టీవీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించడానికి పోలీసులు సమయం కోరటంతో హైకోర్టు విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.
మాజీమంత్రి కొల్లు ముందస్తు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా
మద్యం కేసులో మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడిరచింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో… సీఐడీ అధికారులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ… కొల్లు రవీంద్ర బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. దురుద్దేశపూర్వకంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.