- అరుంధతిలో పశుపతిలా సమాధి నుంచే మళ్లీ ఫేక్ ప్రచారాలు
- కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు
- హత్యలు, అరాచకాలంటూ అబద్ధాలు ఆడుతున్నారు
- వైసీపీ పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్‌తోనే నేరాలు
- ట్యాబ్‌లతో మైనర్లు అత్యాచారాలు చేసే దుస్థితికి తెచ్చారు
- పిల్లలకు విషం పెట్టి చంపి టీడీపీపై తోసినా ఆశ్చర్యం లేదు
- గత ఐదేళ్లలో వారి అరాచకాలు, హత్యలకు లెక్కే లేదు
- జగన్ పాలనలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బలి
- సమాధిలో భూతాలను బయటకు రానిస్తే రక్తం తాగుతాయి
- ఏపీని స్మశానం చేయడానికే దుష్ప్రచారాలకు పూనుకుంది
- బాబు వచ్చాక ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు
- ప్రజల్లో కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే విమర్శలు
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్‌తోనే రాష్ట్రంలో విచ్చలవిడిగా నేరాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మండిపడ్డారు. వైసీపీ నేరాలకు పునాది వేసిందని…కమీషన్ల కోసం కక్కుర్తి పడి అందిం చిన ట్యాబ్‌లలో నీలి చిత్రాలను చూస్తూ బడులకు వెళ్లే మైనర్లు కూడా అత్యాచారాలు చేస్తున్నారని.. మళ్లీ సిగ్గు లేకుండా రాష్ట్రంలో ఏ మూలన ఏ నేరం జరిగినా టీడీపీకి అంట గడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువా రం విలేఖరుల సమావేశంలో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ప్రేతాత్మలా సమాధిలో నుంచే దుష్ప్రచారాలు
తప్పుడు ప్రచారంతోనే వైసీపీ పుట్టింది, బతుకుతోంది. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతడిని బతికి ఉండగానే సమాధి చేశారు. అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారు. నేడు వైసీపీ కూడా ప్రేతాత్మలా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి దుష్ప్రచారాలను మొదలు పెట్టింది. హత్యాచారా లు, దారుణాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ భూతాలను సమా ధిలో నుంచి బయటకు రానిస్తే ఏపీని స్మశానం చేసేస్తాయి. ప్రజల రక్తం తాగుతాయి. చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు.
ప్రజలు ఛీకొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు
కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న యువతకు భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురించాయి. ఒకవైపు పోలవరం నిర్మాణం, మరోవైపు రాజధాని నిర్మాణ పనులు ఊపం దుకున్నాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని, దానికి మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్రమంత్రులే వచ్చి ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్లీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. నాడు కోడికత్తి డ్రామాకు తెరతీసి అది చంద్రబా బు చేయించారని అబద్ధాలు ప్రచారం చేశారు. అలాగే సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపి చంద్రబాబుకు అంటగట్టిన అబద్ధాల కోరులు ఈ వైసీపీ నేతలు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వారికి బుద్ధి రావడం లేదు. ప్రమాదంలో డివైడర్‌కు ఢీకొట్టి చనిపోయినా అది టీడీపీ చేసిన హత్యే అంటూ తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. ఎవరైనా కుటుంబ కలహాలతో ఉరివేసుకున్నా దానిని టీడీపీకి రుద్దుతున్నారు. ఈ తప్పుడు ప్రచారాలను చూస్తుంటేనే సిగ్గుగా ఉంది.
ఫీజు బకాయిలు కట్టి లోకేష్ అండగా నిలిచారు
రూ.3000 కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విద్యార్థులను వైసీపీ ఇబ్బంది పెడితే నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక జీవోను తీసుకువచ్చి వారికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి నారా లోకేష్. 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగివస్తది అని కూటమి ప్రభుత్వం నిరూ పించింది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల శ్రేయస్సు కోసం పాటుపడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కువైట్‌లో ఒక్క వ్యక్తి బాధ పడుతుంటే చలించిపోయిన వ్యక్తి లోకేష్ అతడిని ఇం టికి చేర్చేందుకు కృషిచేశారు. ఒక వ్యక్తి అయినా.. రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబమైనా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ పాలనలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకు దేశంలో మూడు హత్యలు జరుగుతున్నా యి. సంవత్సరానికి 28 వేల హత్యలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు. దేశంలో జరుగుతున్న నేరాలు వేరు. వైసీపీ హయాంలో మనకు ఏవైతే రక్షణ వ్యవస్థగా ఉన్నాయో పోలీసులు, లాయర్లు, ప్రజాపతినిధులు నేరాలకు పాల్పడ్డారు. వైసీపీ పాలనలో కంచే చేనును మేసింది. రాజమండ్రిలో మార్గాని భరత్ తన జీబును తానే తగల బెట్టుకుని దానిని టీడీపీపై రుద్దాడు. తూర్పుగోదావరిలో అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేసి టీడీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేశారు. డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేస్తే వైసీపీ నేతలు అరెస్టు అయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయడానికి చూస్తున్నారు. దాని కోసం వాళ్లే చిన్న పిల్లలు తినే ఆహారంలో విషం కలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మా నాయకులు నేరాలను ప్రోత్సహించరు
చంద్రబాబు, లోకేష్‌లు నిరంతరం అభివృద్ధి వైపే పయనం సాగిస్తున్నారు. కక్షసాధింపు చర్యలకు ప్రోత్సహించరు. అలా ప్రోత్సహించి ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడే ఏ ఒక్కడూ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. మా నాయకుడు ఒక దెబ్బపడైనా ప్రజల వైపు నిలబడాలని తిరిగి దాడులు చేయకూడదని చెప్పారు. వైసీపీ వాళు నేరస్తులు కాబట్టే నేరాలే చేస్తారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. లోకేష్‌పై రాళ్లతో దాడులు చేయించి చంపాలని చూశారు. భువనేశ్వరమ్మ మీద ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు దారుణమైన నేరస్తులు.. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అనంతబాబు, అంబటి, గోరంట్ల లాంటి నేతలు హత్యలు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తలకు పాల్పడుతూ ఘోరమైన నేరాలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళుతుంటే నేరాంధ్రప్రదేశ్‌గా మారి పోయిందని టీడీపీని క్విట్ చేయాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.
600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారు
వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, అక్రమాలను ప్రశ్నించినందుకు వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారు. వాటిపై టీడీపీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. పిన్నెల్లి అనే వ్యక్తి ఒక్కడే ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలను చం పించాడు. 79 దాడులు చేయించాడు. అందులో 51 ఘటనలు ఎస్సీ, ఎస్టీలపైనే జరిగాయి. కూటమి వచ్చాక కూడా 8 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారు. దానిని తప్పుదోవ పట్టించడానికి, విజయసాయిరెడ్డిపై వస్తున్న అక్రమ సంబంధాల ఆరోపణల టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి ప్రజలు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి చంద్రబాబు సమాధి చేసిన వైసీపీ భూతాలను మళ్లీ బయటకు రానివ్వద్దని పిలుపునిచ్చారు.