- లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరు
- విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఎంపీలు
- మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ రఘురామ
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు విచ్చేశారు. చంద్రబాబు, భువనే శ్వరి దంపతులకు సిద్ధార్థ లూథ్రా, ఆయన కుటుం బ సభ్యులు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికా రు. తన కుమారుడి వివాహ విందుకు చంద్రబాబు రావడం పట్ల లూథ్రా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ రిసెప్షన్ కు భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా విచ్చేశారు. ఆయనతో చంద్రబాబు ముచ్చటించడం కనిపించింది. అంతకు ముందు ఢల్లీి విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్నాయుడు స్వాగతం పలికారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి మంగళవారం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
చంద్రబాబును కలిసిన రఘురామకృష్ణరాజు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను రఘురామ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఢిల్లీలో చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన వెల్లడిరచారు. ఆ ఫొటోలో చంద్రబాబు… రఘురామ భుజంపై చేయి వేసి చిరునవ్వుతో కనిపించారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద చంద్ర బాబుకు స్వాగతం పలికిన వారిలో రఘురామ కూడా ఉన్నారు! దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.