- దార్శనికుడు, నవ్యాంధ్ర నిర్మాతకు సాటి రాలేన్న నేతలు
- తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు
- విజనరీ సేవలను గుర్తు చేసుకుంటూ సంబరాలకు పిలుపు
- కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో ఫొటో ఎగ్జిబిషన్లకు నిర్ణయం
- ఏపీ పునర్నిర్మాణం బాబుతోనే సాధ్యమన్న ఆలపాటి
- ఆయన ఒక బ్రాండ్ అని కొనియాడిన అశోక్‌బాబు
మంగళగిరి(చైతన్యరథం): చంద్రబాబు మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబరు 1 నాటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు సం బరాలకు పిలుపునిచ్చారు. ఆయన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఫొటో ఎగ్జిబిషన్లు, పలు సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మం గళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో నేతలు చంద్రబాబు సేవలను గుర్తు చేసుకుంటూ తమ అనుభవనాలను పంచుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వినర్ బుచ్చి రాంప్రసాద్‌లు పాల్గొన్నారు.
విజన్ ఉన్న నేత: ఆలపాటి రాజేంద్రప్రసాద్
ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 1995 సెప్టెంబరు 1 యావత్ తెలుగుజాతి గర్వించదగిన రోజు. సీఎంగా చంద్రబాబు తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు అది. నాటి నుంచి అహర్నిశలు తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమించిన మహోన్నత నాయకుడు చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం. మచ్చలేని చంద్రుడు. తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకునేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు దొరకడం అదృష్టమని, తెలుగు ప్రజల ఖ్యాతిని ఉన్నత స్థానంలో ఉంచడమే ఆయన లక్ష్యమ ని పేర్కొన్నారు. విజన్ ఉన్న నాయకుడు బాబు అమలు చేసిన విధానాలను నేడు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, నవ్యాంధ్ర నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. రాజ కీయాల్లో అపరచాణిక్యుడిగా అభివృద్ధిలో తిరుగులేని వ్యక్తిగా ఎందరో గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, సుందర్ పిచాయ్, చంద్రశేఖరన్ లాంటి వ్యక్తులు ప్రశంసించారంటే సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ముందు చూపు ఏ పాటిదో అర్థం అవుతుందన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. తెలుగు ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి చంద్రబాబు. మహిళాసాధికారత అనే పదానికి అర్థం పరమార్థం చెప్పిన ఏకైక వ్యక్తి. సంక్షేమ పథకాలతో సామాజిక మార్పు తీసుకు వచ్చిన అనితర సాధ్యుడు అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీల లాగే బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషిన వ్యక్తి. సామాజిక మార్పుకు సంకేతంగా దళితుల అభ్యున్నతికి తొలి అడుగు వేసిన వ్యక్తి. అన్ని వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు. వ్యవసాయ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనికుడు. నేడు రాజధానుల్లో మేలైన రాజధాని ఏదని చెప్పుకోవాంటే అందరూ హైదరాబాద్‌నే చూపిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. నాడు చంద్రబాబు విజనరీ థింకింగ్ వలనే సైబరాబాద్ సాధ్యమైందని గుర్తుచేశారు. గతంలో ఉద్యోగాల కోసం చెన్నై, బాంబే, బెంగళూరులకు వెళ్లేవారు నేడు హైదరాబాద్ వెళుతున్నారు. అది చంద్రబాబు ముందుచూపుతోనే సాధ్యమైం దన్నారు. ఏ నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మార్పువస్తుందో ఆ మార్పుతో వికాస వంతమైన సమాజానికి మానవ వనరులను ఎలా పెంపొందించుకోవచ్చో తెలిసిన విజనరీ నాయకుడు. ఎక్కడైతే మానవ వనరులు అభివృద్ధి చెందాయో… ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మిన వ్యక్తి. సాంకేతిక అభివృద్ధికి నాంది పలికింది ఆయనే. బాబు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణకు మంచి ఫలాలను అందిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా అత్మవిశ్వాసంతో నిలబడటం ఆయన నైజం. కష్టాలను అవకా శాలుగా మలుచుకుని విజయం దిశగా అడుగులు వేస్తారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్ర దేశ్‌గా మారుస్తారు. చంద్రబాబు పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నాడు కేవలం ఐదువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే రాష్ట్రంలో నేడు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే చంద్రబాబు వలనే అది సాధ్యమైంది. పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రతి సోమవారం కేటాయించి డయాఫ్రం వాల్ కడితే దాన్ని జగన్ పూర్తి కూల్చేశాడు. పోలవరం అనే జీవనాడిని ప్రజలకు అందించాలని బాబు ప్రతినిత్యం తపన పడుతున్నాడు.
రాజకీయాల్లో అరుదైన వ్యక్తి: అశోక్‌బాబు
పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో 2019 ముందు రాజకీ యాలు ఒక రకంగా ఆ తర్వాత రాజకీయాలు మరో రకంగా ఉన్నాయి. చంద్రబాబు చేయని తప్పుకు ఆయనను జైలుకు పంపారు. ఇంటిపై దాడి చేశారు. హెరిటేజ్‌పై కక్ష సాధింపులకు దిగారు. అయినా భయపడలేదు. చంద్రబాబు అంటేనే విజనరీ నాయకుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి, హార్డ్ వర్కర్.. ఈ మూడు అంశాలు ఒకే వ్యక్తిలో ఉండటం రాజ కీయాల్లో అరుదు. జాతీయ రాజకీయాల్లో గొప్ప అవకాశాలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడే ఉన్నారు. ఆయన విజన్‌తో రోజుకు 18 గంటలు కష్టపడ్డారు అనేక అక్రమ కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిలబడలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా సమాజాభివృద్ధి కోసమే తీసుకున్నారు. ఆయన విజన్‌కు పవర్ ప్లాంట్లే నిదర్శనం.. తన పవర్ పోయినా రాష్ట్రానికి పవర్ ఉంటుందని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. చంద్రబాబు దూరదృష్టితోనే రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఎప్పుడూ గెలుపు ఓటములపై ఆలోచించలేదు. నాడు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు. నేడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారి లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దూరదృష్టి కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ అదృష్టమ ని ఎంతోమంది రాజకీయ ఉద్దండులు అంటున్నారు. చంద్రబాబు తన కోసం తాను ఏమీ చేసుకోలేదు. అందుకే జైల్లో పెడితే ప్రపంచంలో ఉన్న తెలుగువారు ఏకమయ్యారు. ముక్తకంఠంతో ఖండిరచారు. అదే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయన జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. 2019లో ప్రజలు మోసపోయి జగన్‌కు ఓట్లు వేశారు. నేడు చంద్రబాబుపై నమ్మకంతో ఓట్లు వేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతారు. ప్రజలు కోరుకునే విధంగా ఏపీ నెంబర్‌వన్‌గా ఉండాలనే కల నేరవేరే విధంగా ఆయన పాలన సాగిస్తారు. సహనానికి చంద్రబాబు నిలువుటద్దం. ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక బ్రాండ్. ప్రజల కోసం పాటుబడిన చంద్రబాబు జీవిత అంశాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
సంక్షేమ సారథి చంద్రబాబు
బుచ్చిరాంప్రసాద్ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం చంద్రబాబుకు ఇచ్చారు. నాడు రామారావు రూ.30తో పింఛన్‌ను స్టార్ట్ చేస్తే నేడు రూ. 4,000లకు చంద్రబాబు తీసుకెళ్లారు. దాంట్లో చంద్రబాబు పెంచినదే రూ.3,200 ఉంది. సంక్షేమానికి ఎంత పెద్దపీట వేశారో ఇదే నిదర్శనం. రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. చంద్రబాబు తెలుగు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. ఆత్మ విశ్వాసంతో ఎంతో కష్టపడి నేడు అన్ని రంగాల్లో యువ త ముందుకెళుతున్నారు. విదేశాల్లో సైతం సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు పెట్టి 19 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. ప్రతిపక్షంలో కూడా సేవలు కొనసాగిస్తున్నారు. సేవంటే ఎన్టీఆర్, చంద్రబాబులే కనిపిస్తారు తప్ప ఇంకొకరు కనిపించ రని ఉద్ఘాటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశారని, బ్రాహ్మణుల కోసం పాటుబడిన పార్టీ టీడీపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు.