- హామీని అమలు చేసి మాట నిలబెట్టుకున్నారు
- రాష్ట్రంలో ఒకరోజు ముందే పెన్షన్ల పండుగొచ్చింది
- దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఘనత మనకే దక్కింది
- జగన్‌రెడ్డి రూ.3 వేల హామీకి తూట్లు పొడిచి దగా చేశారు
- గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): పెన్షన్ పథకాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యధిక పెన్ష న్ ఇస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించి లబ్ధిదారుల్లో ఆనందం నింపిన ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. మచిలీపట్నంలో శనివారం పలువురు వృద్ధులు, దివ్యాంగులకు మంత్రి పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ రూ.30 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్రమంగా పెంచుతూ రూ.2000 చేశారు.. జగన్‌రెడ్డి రూ.3000 ఇస్తానని ఐదేళ్లు నాన్చి దగా చేసి విడతల వారీగా పెన్షన్ అంటూ వృద్ధులను పచ్చి మోసం చేశాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీ నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుంచి పెంచిన మొత్తం ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. దేశంలోనే 65 లక్షల మందికి రూ.4000 పెన్షన్ అందించే ఏకైక ప్రభుత్వం కూటమి అని ప్రశంసించా రు. దివ్యాంగులకు రూ.6000, పూర్తి వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు, కిడ్నీ రోగు లకు పెన్షన్ పెంచి అందిస్తున్నామన్నారు. పేదలకు అండగా వారు శాశ్వతంగా ఆనందం చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయ కులు పాల్గొన్నారు.