- తెదేపా నేతలు, శ్రేణులు, అభిమానుల్లో సంతోషం
- మానవీయ, ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- మెడికల్ రిపోర్టుల ప్రకారం కంటి ఆపరేషన్ అత్యవసరమన్న న్యాయమూర్తి
- ప్రతి పౌరునికి కోరుకున్న వైద్యం పొందే హక్కుందన్న హైకోర్టు
- ఆరోగ్య భద్రత, జీవన హక్కుని కాపాడటం కోర్టుల ప్రధాన ధర్మం
- ప్రాణం పోతే పూర్వ స్థితి తేలేమన్న న్యాయమూర్తి
- సమాజంలో ప్రముఖుడు, గౌరవప్రదమైన చంద్రబాబు న్యాయవిచారణకు సహకరించరని భావించలేం
- చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం
- కంటి ఆపరేషన్ గురించి ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన రెండు నివేదికల్లోని తేడాను ఎత్తిచూపిన న్యాయమూర్తి
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
అమరావతి : హైకోర్ట్ న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లిఖార్జునరావు నిన్న చంద్రబాబుకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి… చంద్రబాబు వయసు, ఆయనకు ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు, ఎడమకంటికి సత్వ రమే శుక్లం ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని పరిగణ నలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేశారు. చంద్ర బాబు ఆరోగ్యానికి సంబంధించి పలువురు డాక్టర్లు ఇచ్చిన నివేదికలను తమ తీర్పులో న్యాయమూర్తి ఉద హరించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్న వోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. చంద్రబాబు ఆరోగ్య తీవ్రతపై ఆయన న్యాయవాదులు చేసిన వాదనలను న్యాయమూర్తి అంగీ కరిస్తూ అనుకూలంగా తీర్పునిచ్చారు.
ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణే సర్వోత్తమ బాధ్యత :
హైకోర్టు న్యాయమూర్తి మల్లిఖార్జునరావు తమ 15 పేజీల తీర్పులో ప్రతి వ్యక్తి ఆరోగ్యం, బాగోగులను పరి రక్షించడమే ప్రధాన ధర్మమని న్యాయస్థానం ప్రగాఢం గా విశ్వసిస్తోందని.. నమోదైన కేసు తీవ్రతకు సంబం ధం లేకుండా ఈ ధర్మాన్ని నెరవేర్చాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసు విచారణ దశలో ఒక వ్యక్తిని కస్టడీలో ఉంచడం శిక్షగా భావించరాదని, ప్రతివ్యక్తికి సమగ్రమైన వైద్యసేవలు పొందే హక్కు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి తీవ్ర మైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు..తగిన వైద్యసేవలు అందే విధంగా చేయాలని న్యాయస్థానం బలంగా నమ్ముతోందని ఆయన అన్నారు. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు పరిస్థితి ప్రమాద స్థాయికి చేరేదాకా న్యాయస్థానం వేచి ఉండకూడదం టూ, చంద్రబాబు విషయంలో అత్యవసర కంటి ఆప రేషన్‌కు సంబంధించి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఎక్కడ వైద్య సేవలు పొందాలో నిర్ణయిం చుకునే హక్కు రోగికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లోతుపాతుల్లోకి పోకుం డా, చంద్రబాబు ఆరోగ్య తీవ్రత,కంటి ఆపరేషన్ సత్వర ఆవశ్యకతల దృష్ట్యా తగు వైద్యం పొందేందుకు ఆయ నకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి మల్లి ఖార్జునరావు వివరించారు.
పరిగణనలోకి తీసుకున్న వైద్యనివేదికలు
- ఎల్.వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నివేదిక
చంద్రబాబు న్యాయవాదులు కోర్టుకు అందించిన ఎల్.వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నివేదికలో.. చంద్ర బాబు ఎడమకంటికి 21-06-23న శుక్లం ఆపరేషన్ జరిగిందని అయితే ఆయన కుడి, ఎడమ కళ్లమధ్య దృష్టి వ్యత్యాసం ఉన్నందున మూడు నెలల్లో కుడికంటికి కూడా ఆపరేషన్ చేయాలి. ఈ నివేదికను ప్రస్తావిస్తూ.. దీనిప్రకారం కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సిన గడువుని 21-06-23 నుండి పరిగణనలోకి తీసుకోవాలని…ప్రభుత్వ లాయర్ అందు నిమిత్తం చెప్పిన 21-10-23 నుంచి కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
- డాక్టర్ పీ.నవీన్ చందర్‌రెడ్డి, మెడికల్ డైరెక్టర్ ఏ.ఐ.జీ హాస్పిటల్స్ వారి నివేదిక
73 సంవత్సరాల చంద్రబాబు చిరకాలంగా మా నుంచి వైద్యసేవలు పొందుతున్నారని.. ఆయనకున్న దీర్ఘకాలిక హృదయ, చర్మ సమస్యల దృష్ట్యా, ఆయనను చల్లటి వాతావరణంలో ఉంచాలని.. లేకుంటే హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉందని… ఇం దుకు సంబంధించిన పరీక్షలు, చికిత్సకోసం అవసర మైతే మావద్దకు రావాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.
- డాక్టర్ బీ.శ్రీనివాసరావు, సివిల్ సర్జన్,రాజమహేం ద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వారి నివేదిక
25-10-2023న ఇచ్చిన నివేదికలో చంద్రబాబు కుడి కంటిలో దృష్టిలోపం ఉందని, ఐ.ఓ.ఎల్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, జైలు సూప రింటెండెంట్‌కు నివేదిక ఇచ్చారు.
- అదే రోజున జైలు సూపరింటెండెంట్‌కు ఇచ్చిన మరోనివేదికలో చంద్రబాబు కుడికన్ను దృష్టిలోపం అంత తీవ్రమైనది ఏమీకాదని, అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం ఏమీలేదంటూ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ రెండు నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి మల్లిఖార్జునరావు పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు లేఖలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వాలో, ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలో స్పష్టం కాని పరిస్థితి ఉంద ని ఎత్తిచూపారు.
- డాక్టర్ మార్కండేయులుతో కూడిన 5గురు డాక్టర్ల బృందం ఇచ్చిన 5 నివేదికలు
ఈ నివేదికల్లో చంద్రబాబుకు సమగ్ర రక్తపరీక్షతో పాటు మొత్తం 10రకాల పరీక్షలు చేయాలని, సూచించ డం జరిగింది. వీటిద్వారా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి వెల్లడైంది.
బెయిల్ కోసం కంటి ఆపరేషన్ సాకుగా చూపలేదు :
కోర్టుకు అందించబడిన ఆధారాల దృష్ట్యా చంద్ర బాబుకి ఈ సంవత్సరం సెప్టెంబర్లో కుడి కంటి ఆపరే షన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. కేవ లం బెయిల్‌కోసం కంటి ఆపరేషన్‌ను సాకుగా చూపు తున్నారనడం ధర్మం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. చంద్రబాబు వయసు దృష్ట్యా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం సహజమని.. వాటికి సంబంధించి సమర్పిం చబడిన నివేదికలను అనుమానించడానికి ఎటువంటి ఆధారాలు లేవని..ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బీ.శ్రీనివాస రావు ఇచ్చిన రెండో నివేదికలో కూడా కంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పలేదని.. ఇందు కారణంగా ప్రభు త్వం ప్రతిపాదించినట్టు చంద్రబాబు మెడికల్ బోర్డు ముందు హాజరుకావాల్సిన అవసరం లేదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు.
ప్రభుత్వవాదనతో ఏకీభవించని హైకోర్టు :
చంద్రబాబు సుప్రీంకోర్టులో 17(ఏ) వర్తింపు కోసం వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున అది వచ్చేవరకు మధ్యంతర బెయిల్ అభ్యర్థనను పరి గణనలోకి తీసుకోరాదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి గానీ, హైకోర్ట్ నుంచి గానీ బెయిల్ పొందడానికి ఎటువంటి అడ్డంకి కాదని చంద్ర బాబు తరుపున చేసిన వాదనలు సబబుగా ఉన్నాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
చంద్రబాబు ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని, అంత తీవ్రమైన పరిస్థితి ఏమీలేదని జైలు ప్రాంగణంలో తగు వైద్యసేవలు అందించబడుతున్నాయి కనుక మధ్య ంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధా కర్‌రెడ్డి వాదించారు. అయితే.. చంద్రబాబుకి అత్యవస రంగా కుడి కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఆల స్యమైతే తీవ్రమైన దృష్టి సమన్వయలోపం ఏర్పడే ప్రమా దముందని చంద్రబాబు తరుపున్యాయవాది కోర్టు దృష్టి కి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న మీదట న్యాయ మూర్తి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
గౌరవప్రదమైన వ్యక్తి చంద్రబాబు :
చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ కు సహకరించరని తాము ఏ మాత్రం భావించడం లేదని న్యాయమూర్తి మల్లిఖార్జునరావు స్పష్టం చేశారు. చంద్రబాబుకి ప్రజలతో పటిష్టమైన బంధం ఉందని, ఆయన 14సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన, ప్రస్తుతం శాసనసభ సభ్యునిగా ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్న గౌరవ ప్రదమైన వ్యక్తి అని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని న్యాయమూర్తి తెలిపారు.
హైకోర్టు సూచనలు :
చంద్రబాబు తాము కోరుకున్న ఆసుపత్రిలో తమ సొంత ఖర్చుతో వైద్యసేవలు పొందవచ్చని న్యాయ మూర్తి మల్లిఖార్జునరావు తన తీర్పులో స్పష్టం చేశారు. ఆయన తిరిగి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాలని, అప్పుడు తాము పొందిన వైద్యసేవలకు సంబంధించిన అన్ని వివరాలను జైలు సూపరింటెండెంట్‌కు సమర్పిం చాలని, అప్పటిదాకా ఈ కేసుకు సంబంధించిన ఎవరి నీ ప్రభావితం చేయరాదని న్యాయమూర్తి స్పష్టం చేశా రు. లక్షరూపాయల రెండు పూచీకత్తులు ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌పై విచారణను నవంబర్ 10న హైకోర్టు చేపడుతుంది.
మధ్యంతర బెయిల్ పరిణామం :
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యం తర బెయిల్ మంజూరైనందున, ఇతర ఏ కేసులో కూడా వచ్చేనెల 28వరకు రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదని న్యాయనిపుణలు అభి ప్రాయపడుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాష్ట్ర సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను కొట్టి వేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టుని ఆశ్ర యించిన విషయం తెలిసిందే.అవినీతి నిరోధక సవ రణ చట్టం సెక్షన్ 17(ఏ) ప్రకారం,గవర్నర్ అనుమ తి లేకుండా తనపై కేసున మోదుచేయడం చట్టవిరు ద్ధమంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వచ్చే నెల 9లోగా ఈ విషయంపై తమ తీర్పును వెల్లడి స్తామని సంకేతాలిచ్చింది. ఈ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే, ఇప్పటివరకు ఆయనపై నమో దు చేయబడిన మొత్తం 5 కేసులు వీగిపోతాయని న్యాయనిపుణుల అభిప్రాయం.