జనం రుణం తీర్చుకోవాలనుకుంటున్నా. నేను మీ గుండెల్లో ఉండటమే నా సంకల్పం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ పరిపాలనలో రౌడీలు రోడ్డుమీదకు వస్తున్నారు. నాముందు కుప్పిగంతులు వేయవద్దని వైసీపీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. గాలి, వాన భయపడింది. మా తమ్ముళ్లు కాదు అని చెప్పారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరును అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నా. ఎర్రగొండపాలెం అభివృద్ధి బాధ్యత టీడీపీది అని పేర్కొన్నారు. పేదలను సంపన్నులు చేసే కార్యక్రమానికి సంకల్పం చేశానన్నారు. ప్రతి నిరుపేదకు అండ. టీడీపీ జెండా అన్నారు. పేదవాళ్లను కోటీశ్వరులను చేసేందుకు ఏయే మార్గాలున్నాయో అన్నిటినీ అన్వేషిస్తానని చెప్పారు. సంపద సృష్టించడమే కాదు. దాన్ని పేదవాళ్లకు చేర్చాలని అభిప్రాయపడ్డారు.
జగన్ అవినీతితో డబ్బు సంపాదిస్తే. కష్టపడి మనం కోట్లు సంపాదించలేమా? అని ప్రశ్నించారు. వైసీపీ పనైపోయింది. ఎవ్వరూ కాపాడలేరు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు అని విమర్శించారు. చేతగాని పాలనలో చిన్న గాలికే కరెంటు పోయిందన్నారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్ అన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చుంటే పోలవరం పూర్తయ్యుండేదని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానని హామీ ఇచ్చారు. మూలాలు లేని ఆదిమూలం. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. జగన్ కోర్టులకు కూడా ఒక సవాల్ గా మారాడన్నారు.