అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తాం
దేశంలో మొదటిసారి దీపం పధకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం
మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం.
సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ.
నాలుగేళ్లుగా ఉన్మాది పాలన సాగుతుంది.
ఆడబిడ్డలు ఎవరికి రక్షణ లేదు.
ఏ సైకో వస్తాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితి.
టీడీపీ ఉంటే ఆడబిడ్డల పట్ల కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉండేది.
ఇంట్లో పడుకున్నా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి ఉంది.
ఎప్పుడు ఎవరు వచ్చి యాసిడ్ పోస్తారో తెలియదు.
రేపల్లెలో దారుణం జరిగితే దద్దమ్మ సీఎం ఎందుకు వెళ్ళలేదు.
సీఎం కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే స్పందించడా?
నాయకుడు సక్రమంగా ఉంటే మన ప్రాణాలకు రక్షణ ఉంటుంది.
నాలుగేళ్లలో 52 వేల 587 దాడులు,అఘాయిత్యాలు జరిగాయి.
22 వేల 278 మంది మహిళలు కనిపించకుండా పోయారు
3372 మందిపై అత్యాచారాలు జరిగాయి
41 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి