- స్కిల్ కేసులో ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన ఎస్‌ఎల్‌పీపై తీర్పు చెప్పిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
- విచారణ చేపట్టిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
- సెక్షన్ 17ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
- సీజేఐ పరిశీలనకు పంపించాలని ద్విసభ్య ధర్మాసనం తీర్పు
- సీజేఐ నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశం
- ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధి నేత చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముందుకు పంపిం చాలని ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడి న ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.
అయితే, ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయ మూర్తులు అనిరుద్ధ బోస్,బేలా ఎం.త్రివేది మధ్య తీర్పు లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువురు న్యాయమూ ర్తుల తీర్పులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నా యి. విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు 17ఏ వర్తి స్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ పేర్కొనగా, చంద్ర బాబుకు 17ఏ వర్తింపజేయలేరని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయా లు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో తదు పరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుం డా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ధబోస్ అన్నారు. కేసు ల నమోదుకు ముందు సీఐడీ తగినఅనుమతి తీసు కుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17-ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని… లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడిరచారు. అవి నీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది. పదవిలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణ యాలపై విచారణ జరిపితే అది చట్టవ్యతిరేకం అవు తుంది. చట్టంలోని సెక్షన్ 13(1) (సి), సెక్షన్ 13 (1) (డి), సెక్షన్ 13(2) కిందికి వచ్చే నేరారోపణలపై తగిన (గవర్నర్) అనుమతులు తీసుకోకుండా చంద్ర బాబును విచారించలేరు. ఈ కేసులో చంద్రబాబును విచారించా లంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుమతి తీసు కోవచ్చు. ఆ మేరకు అనుమతి కోసం సంబంధిత వర్గా లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు.
అయితే 2018లో చట్టసవరణ కంటే ముందు జరి గిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది అన్నారు. నిజాయతీ గల పబ్లిక్ సర్వెంట్స్‌కు ఇబ్బంది ఉండకూడదనే సెక్షన్ 17-ఏ చట్టసవరణ తెచ్చారని చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సీజేఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమ ని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిందని చంద్రబాబు తొలుత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబరు 22న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు అదే నెల 23న సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే… సీఐడీ తరపున ముకు ల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి గత అక్టోబరు 17న తీర్చు వాయిదా వేసింది.
జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పులోని అంశాలు..
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం,
- ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచారణ చేయడం తగదు.
- అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదు.
- ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేం.
- విస్తృత ధర్మాసనం ముందుకు..
చంద్రబాబు కేసుల క్వాష్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం తీర్పును సీజేఐ పరిగణనలోకి తీసుకుని విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ధర్మానసం ముందు కూడా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. రెండు వర్గాలు వాదనలు వినిపించిన తర్వాత త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చినా.. మెజారిటీ నిర్ణయం ప్రకారం తీర్పు ఖరారు చేస్తారు. అయితే వచ్చే రెండు, మూడు నెలల్లో విస్తృత ధర్మా సనం వాదనలు పూర్తి కావడం.. తీర్పు రావడం కష్ట మని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ద్విసభ్య ధర్మాసనం కూడా వాదనలు పూర్తయిన తర్వాత దాదాపుగా మూడు నెలల తర్వాత తీర్పు చెప్పటం గమనార్హం.
ఈ క్రమంలో చంద్రబాబుకు ఒక్క ఫైబర్ నెట్ కేసులో మినహా మిగిలిన అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ వచ్చింది. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముం దస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంది. ఈ పిటి షన్‌పై బుధవారం(17వ తేదీ) విచారణ జరుగుతుంది. క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని ఇంతకుముందు ధర్మాసనం ప్రకటించింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపినందున.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.