అసత్య ప్రచారాలతో ఎన్నికలలో లబ్ది
హత్యకు సంబందించి ప్రతి ఉదంతం జగన్ కు తెలుసని సిబిఐ చెప్పింది
హత్యలు చేయించే వారిని సిఎంగా పెట్టుకుంటే పిల్లల భవిష్యత్ ఏమవుతుంది?
వివేకా హత్య కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలకు జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో ఆ హత్యకు
సంబంధించి తనపై నెపం వేసి నారాసుర రక్తచరిత్ర అని రాసి, లబ్దిపొందారని చంద్రబాబు చెప్పారు.
రాజమహేంద్రవరం లో జరుగుతున్నమహానాడు కార్యక్రమంలో భాగంగా శనివారం జరిగిన ప్రతినిధుల సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈమేరకు డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసులో అసలు దోషి జగనే అని సిబిఐ అఫిడవిట్ తో తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వివేకాను హత్యచేసి ఊసరవెల్లి ని మించి వేషాలు వేశారని విమర్శించారు. ఇప్పటివరకు వివేకా హత్యలో రోజుకో మాయ మాట చెప్పారని తేలిపోయిందన్నారు.
వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ కు తెలుసని సిబిఐ స్వయంగా చెప్పిందని చంద్రబాబు వెల్లడించారు. హత్యలు చేసే వ్యక్తిని, హత్యలు చేయించే వ్యక్తిని సిఎంగా పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సొంతపత్రిక, టీవి లను అడ్డుపెట్టుకొని ఇప్పటివరకు నాపై బురద చల్లారు. ఇప్పుడు దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలకు జగన్ సమాధానం చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. హత్యకు ముందు, హత్య తర్వాత నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే వున్నారని చెప్పారు. ఆ విషయాలు అవినాష్ రెడ్డి ప్రతి నిమిషం జగన్ కు వివరించారు అని చందబాబు పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు జగన్ మోహన్ రెడ్డే అని సిబిఐ పేర్కొందని, హత్యకు సంబంధించి ప్రతి ఉదంతం జగన్ కు తెలిసే జరిగింది అని కూడా సిబిఐ చెప్పిందని, వీటన్నింటికి, పరిణామాలకు జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.