అమరావతి: సచివాలయంలో శుక్రవారం జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ను సైతం దర్శించేవారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరుగులు పెట్టించి 72 శాతం వరకు పనులు పూర్తి చేయించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చి, పోలవరం ప్రాజెక్ట్‌ను గోదాట్లో ముంచేశాడు. కాగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించే అవకాశముంది. స్థానికంగా ఉంటే ప్రతి రోజు సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సీఎం సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.