పర్చూరు: మిర్చిరైతు కష్టం చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. అక్కడికక్కడే 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరు గ్రామం మీదుగా వెళుతుండగా భారీ వర్షాలకు దెబ్బతిన్న 6 ఎకరాల మిరప తోటను పీకేస్తున్న గడ్డం శ్రీనివాసరావు అనే రైతును చూసి, వాహనం ఆపి పలకరించారు. దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. పొలా ల్లోని నీరు బయటకు వెళ్లక పోవడంతో మిరప మొక్కలు కుళ్లి పోయాయని శ్రీనివాసరావు చెప్పాడు. చేసేది లేక పంటను పీకేస్తున్నానన్నాడు. దీంతో చంద్రబాబు ఆ రైతుకు రూ. 2 లక్షల సాయం ప్రకటించారు. దైర్యంగా ఉండాలని రైతుకు సూచించారు.