.నా భద్రత విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యం
.పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజం
అమరావతి: చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. త్వరలోనే నాపై కేసు నమోదవుతుందని కొందరు చెప్పారని అన్నారు. ఇంటిలిజెన్స్ అనేది ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వం కోసం కాదని అన్నారు. నాకు భద్రత విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దు దాటితే నాతో పాటు భద్రత సిబ్బంది రాబోరని చెబుతున్నారు.. భద్రత విషయంలో వైసీపీ నేతలకు ఎలాంటి షరతులు ఉండవా అని ప్రశ్నించారు. భద్రత విషయంలో ప్రభుత్వం నన్ను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది ..గన్మెశన్లను మారిస్తే తప్పులేదు.. నా గన్మ్నెన్లనే ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో గత కొంతకాలంగా మాజీ మావోయిస్టుల కదలికలు పెరిగాయి.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని బయటపెడుతున్నందుకే ఇదంతా చేస్తోందని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.