- ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటనష్టం పరిశీలన
అమరావతి: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతు లకు బాసటగా నిలవనున్నారు. అధికారంలో ఉన్నా, లేక పోయనా విపత్తుల వేళ ప్రజలకు అండగా నిలిచే చంద్రబాబు మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తగ్గిన రెండురోజుల్లోనే వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన కు బయలుదేరారు. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు చంద్ర బాబు పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా ల్లో టీడీపీ అధినేత పర్యటించను న్నారు. శుక్రవారం వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి బాపట్లలో బస చేయనున్నారు. శనివారం పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు. రైతులను పరామర్శించి వారికి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు.
చంద్రబాబు శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి తొలుత తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు గ్రామానికి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మండలంలో దెబ్బతిన్న పంటచేలను పరిశీలించిన అనంతరం అరగంట పాటు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతారు. ఆ తరువాత రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలోని ఉత్తరపాలెం గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పాతనందాయపాలెంలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, బాపట్ల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.