టిడిపి అధికారంలోకి రాగానే స్వర్ణకార కార్మికులను చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మావరం లో స్వర్ణకార సంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. స్వర్ణకార సంఘం ప్రతినిధుల తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ పేద స్వర్ణకార కార్మికులకు పక్కాగృహాలు నిర్మిస్తామన్నారు.
స్వర్ణకారులు స్వేచ్చాయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మాదిరిగానే స్వర్ణకారులను కూడా ప్రభుత్వం లంచాలకోసం వేధిస్తోందన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణకారులకు వేధింపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
లోకేష్ ను కలిసిన స్వర్ణకార సంఘం ప్రతినిధులు :
• ధర్మవరంలో స్వర్ణకార సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు.
• కరోనా తర్వాత తగిన వ్యాపారం లేక స్వర్ణకారులు, బంగారు పనిచేసే కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణకార కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి.
• చిన్న స్వర్ణకారులకు బ్యాంకురుణాలు మంజూరుచేసి ఆదుకోవాలి.
• బంగారు పనిచేసే కార్మికులకు ఇళ్లు మంజూరు చేయాలి.
• 50ఏళ్లు పైబడిన పేద స్వర్ణకార కార్మికులకు పెన్షన్లు మంజూరుచేయాలి.
• ధర్మవరంలో స్వర్ణకార అసోసియేషన్ భవనాన్ని ఏర్పాటుచేయాలి.
• స్వర్ణకారులపై పోలీసు దౌర్జన్యాలు, వేధింపులు లేకుండా చూడాలి.
యువనేత లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మాదిరిగానే స్వర్ణకారులను కూడా ప్రభుత్వం లంచాలకోసం వేధిస్తోంది.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణకారులకు వేధింపులు లేకుండా చేస్తాం.
• స్వర్ణకార కార్మికులను చంద్రన్న బీమా పరిధిలోకి తీసుకువస్తాం.
• పేద స్వర్ణకార కార్మికులకు పక్కాగృహాలు నిర్మిస్తాం.
• స్వర్ణకారులు స్వేచ్చాయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తాం.