- సీఈఓకు టీడీపీ నేత వర్ల ఫిర్యాదు
- మూడో గోదాములో నోట్ల కట్టలున్నాయని అనుమానం
- ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు
- తాయిలాలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ కుట్రలు
- దోచుకున్న వేలకోట్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు
అమరావతి, చైతన్యరథం: వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, భారీ ఎత్తున తాయిలాలిచ్చి ఓట్లను కొనాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. సహజ వనరు లు, కల్తీ మద్యం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో వాడుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట వద్ద గోడౌన్ ల్లో దొరికిన మెటీరియల్‌ను సీజ్ చేయడంతో పాటు మిగిలిన మరో గోడౌన్‌కు కూడా తెరిచి, సమగ్ర విచా రణ జరపాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాను కలిసి వర్ల రామయ్య, బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, టీడీపీ అధికార ప్రతినిధి షేక్ రఫీ, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు అఖిల్ బుధవారం కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…
మంగళవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాత ఎయిర్‌పోర్టు రోడ్డు లోని మూడు గోడౌన్‌లకు భారీ ఎత్తున తాయిలాలు చేరాయి. ఒక గోదాములో ఖరీద్కెన వాచీలు, కుక్కర్లు, ఫ్యాన్లు ఉన్నాయని వివరించారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఎమ్మార్వో, రిటర్నిం గ్ అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో సీఈఓతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవా లని కోరగా మరో తాహసీల్దార్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. మూసి ఉన్న మరో గోడౌన్‌ను తెరవగా, దానినిండా గడియారాల బాక్సులు, కుక్కర్లు, చీరలు, బొట్టు బిళ్లలు, మేకప్ కిట్స్, జాకెట్ పీసులు, హ్యాండ్ ఫ్యానులు నిండి ఉన్నాయి. మూడో గోడౌన్‌లో భారీగా రూ.500కట్టలతో నగదు నిల్వచేసి ఉంటారని మాఅను మానం. రేణిగుంటలో గోడౌన్‌లు ఏర్పాటుచేసి అక్కడ నుంచి రాష్ట్రమంతటా పంపిణీ చేయాలని వైసీపీ నాయ కులు చూస్తున్నారు. మా నాయకుల్లో ఒకరికి వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫోన్ చేసి.. ఇది చాలా పెద్ద వాళ్ళు ఉన్న వ్యవహారం, మీరు నోరు మూసుకొని వెళ్ళండని బెదిరించాడు.
చెవిరెడ్డి మాట్లాడిన ఆడియో ను కూడా ఫిర్యాదుతో జత చేశాం. మూడో గోడౌన్‌ను తెరవాలని ఈసీని కోరాం. తప్పకుండా మూడో గోడౌన్ ను తెరిపిస్తామని, ఓటర్లను ప్రలోభాలు పెట్టడానికి నిల్వ చేసినవాటన్నింటిని సీజ్ చేస్తామని ఆయన చెప్పా రు. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు… కేవలం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మాత్రమే మేము సమాధానం చెప్పాలి… మేము ఎవరి ప్రలోభాల కులోను కావడం లేదు…మూడు గోడౌన్‌ల్లో అను మతి లేని సామగ్రి మొత్తాన్ని సీజ్ చేస్తామని సీఈవో హామీ ఇచ్చారని వర్ల రామయ్య తెలియజేశారు.
పాలనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసమర్ధత
రాష్ట్ర పాలన ఎన్నికల కమిషన్ పరిధి లోకి వెళ్లినా ఇంకా జగన్ సర్కార్ పెత్తనం చేయడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసమర్ధతను చూచిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా నాయకులు ఓటర్లకు గిప్టులు పంచి ప్రలోభ పెట్టేందుకు శ్రీకాళహస్తి, రేణి గుంట విమా నాశ్రయానికి దగ్గరలోని రెండు గోడౌన్‌లలో పెద్దఎత్తున స్టాక్ పెట్టారన్నారు. అధికారపార్టీ పట్ల ఎన్నికల సం ఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మంగళగిరిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నాలు
‘జగన్‌రెడ్డి పరిపాలన అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబునాయుడితోనే రామరాజ్యం సాధ్య మౌతుందని ప్రజలు నమ్మి రాబోయే ఎన్నికల్లో ఆయన ను గెలిపించాలనుకుంటున్నారు. ఇది గమనించిన జగ న్‌రెడ్డి అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నాడు.అప్రజాస్వామ్య,చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం చేలా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు ఓటర్లకు గిప్టు లు పంచి ప్రలోభ పెట్టేందుకు శ్రీకాళహస్తి, రేణి గుంట విమానాశ్రయానికి దగ్గర్లోని రెండు గోడౌన్‌లలో పెద్ద ఎత్తున స్టాక్‌చేశారు. అందులో రిస్ట్ వాచ్‌లు, కుక్కర్లు, గొడుగులు, చీరలు, హ్యాండ్ ఫ్యాన్లు లాంటి కోట్లాది రూపాయలు విలువచేసే ఖరీదైన గిప్టులు ఉన్నాయి. ఈ గోడౌన్‌లలో పెద్దఎత్తున డబ్బు సైతం దాచిపెట్టారని అక్కడఅందరూ అంటున్నారు.
ఈ వ్యవహారంపై తెదేపా నాయకులు సీఈసీకి, ఎస్‌ఈసీకి, ఆర్‌ఓకు, సీ విజిల్‌లో సైతం పిర్యాదుచేశారు.సీవిజిల్ పిర్యాదు నెం.822869 తో పిర్యాదుచేసినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకో లేదు. ఎన్నికల సంఘం ఆశించిన రీతిలో పనిచేయడం లేదు.ఎన్నికల నియమావళినికాలరాస్తున్న వైసీపీ నాయ కులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు ఆ గోడౌన్‌ల ను ఎందుకు సీజ్ చేయడం లేదు? జిల్లా ఎస్పీ,కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సరైన రీతిలో స్పందించక పోవడం బాధాకరమన్నారు.
తెదేపా కార్యకర్తలకు చెవిరెడ్డి బెదిరింపులు
వందలాది మంది తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నిన్నటి నుంచి ఆగోడౌన్‌లకు కాపాలా కాస్తున్నారు.పోలీ సులు చేయాల్సిన పని తెదేపా కార్యకర్తలు చేస్తుంటే తిరిగి వారినే బెదిరిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మా నేతలకు ఫోన్‌చేసి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు,నాయ కులు గోడౌన్‌ను విడిచిపెట్టాలని, లేదంటే తీవ్రపరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలుచూస్తుంటే పాలన ఇంకా జగన్‌రెడ్డి చేతుల్లోనే ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా, ఎన్నికల అధికారులు చట్టబద్దంగా వ్యవహరించి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయ త్నం చేస్తున్న వైకాపా నాయకులపై వెంటనేచర్యలు తీసుకోవాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య సౌధానికి పునాధు ల్లాంటివి.అటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాం తంగా ఎన్నికలసంఘం నిర్వహించకపోతే ప్రజా స్వామ్యానికే ప్రమాదకరంగా మారుతుందని రామయ్య హెచ్చరించారు.