- మంత్రి లోకేష్ ప్రశంసలు
- మరిన్ని విజయాలు సాధించాలి
- యువతకు స్ఫూర్తిగా నిలవాలి
అమరావతి (చైతన్యరథం): అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి లోకేశ్ అభినందించారు. ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి విజయం సాధించటంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హంపిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి కిరీటాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ అసాధారణమైన ఫీట్.. మీ పట్టుదల, సంకల్పం, ఆటలో నైపుణ్యానికి అద్దం పడుతోంది. హంపి మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలి. మీరు నిజమైన భారతీయ చెస్ లెజెండ్’’ అంటూ లోకేష్ కొనియాడారు.