• ఉదయగిరి నియోజకవర్గం చోడవరం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• సోమశిల ఉత్తర కాలువ కలిగిరి నుండి క్రాకుటూరు మీదుగా తిమ్మ సముద్రం వద్ద ఆగిపోయింది.
• ఈ ప్రాంతంలో గిరిజనుల పొలాలు అధికంగా ఉన్నాయి.
• గిరిజనుల సమస్యను 2018-19లో అప్పటి ఎమ్మెల్యే పరిష్కరించారు. కానీ, అక్కడ కాలువ పనులు ఆగిపోయాయి.
• వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పనులను పట్టించుకోలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక తిమ్మ సముద్రం, కేశవరం, చోడవరం (ఎర్రచెరువు) చోడవరం(ఊరచెరువు) రామవరప్పాడులలోని చెరువులకు నీరు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు.
• టీడీపీ హయాంలోడ సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు 68,294 కోట్లు ఖర్చు చేశాం.
• టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక సోమశిల ఉత్తర కాల్వ పనులు పూర్తిచేస్తాం.
• ఉదయగిరి నియోజకవర్గంలో గొలుసుకట్టు చెరువులకు నీరందించి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం.