కర్నూలులో క్రిస్టియన్ సోదరుల విజ్జప్తి మేరకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శనివారం కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద క్రిస్టియన్ సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. కర్నూలులో పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవ సమాజ సమావేశాల కోసం కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేయాలి.
ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికలో స్థలం కొలత ఏర్పడింది. దీంతో అత్యక్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థలాన్ని కేటాయించి శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల క్రిస్టియన్ మైనారిటీల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలను విలీనంపేరుతో కొట్టేశారు. శ్మశాన వాటికకు అవసరమైన కొత్త స్థలాన్ని కూడా కేటాయిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.