అమరావతి: కారంపూడి సీఐ చిన్న మల్లయ్యపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైర్ అయ్యారు. వైసీపీ ప్యాకేజీ మత్తులో సీఐకు తెలియడంలేదు కానీ.. సీఎం జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయిందని అన్నారు. కారంపూడిలో ఓ టీ స్టాల్ వద్ద టీడీపీ శ్రేణులు టీ తాగుతుంటే వారిని సీఐ మల్లయ్య తుపాకీతో బెదిరించడంపై ఎక్స్ వేదికగా లోకేష్ స్పందించారు. పోకిరి సినిమా అనుకుంటున్నారా.. సర్వీస్ రివాల్వర్ గురిపెడుతున్నారు?.. జగ్గూభాయ్ కళ్లల్లో ఆనందం కోసం సన్నగండ్ల టీడీపీ నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాకీల గూండాయిజంపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా ఏపీలో అధికారపార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని సార్లు చెప్పినాసరే కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. అధికార వైసీపీ నేతలు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రతిపక్ష నేతలు ఏం చేసినా సరే తప్పంటున్నారు. పల్నాడు జిల్లా, కారంపూడిలో సీఐ మల్లయ్య టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీ తాగుతున్న టీడీపీ శ్రేణులను సీఐ తుపాకీతో బెదిరించారు. తుపాకీ ఎందుకు తీశారని ప్రశ్నించిన టీడీపీ శ్రేణులపై మల్లయ్య ఎదురుదాడి చేశారు.