- చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజులైనా పైసా అవినీతి నిరూపించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం
- జగన్ ఆదేశాల ప్రకారం నడుచుకున్న సీఐడీ చివరకు ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచింది
- నిన్నటివరకు స్కిల్ కేంద్రాలే లేవన్న వారు నేడు మాట మారుస్తున్నారు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ప్రభుత్వం పెట్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు బోగస్ కేసు అని ప్రజలకు అర్థమైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన సభ్యత్వ రుసుమును స్కిల్ కేసులో అవినీతి సొమ్ముగా చూపించే స్థాయికి సీఐడీ దిగజారిపోయిందన్నారు. ఈ కేసులో రూపాయి సొమ్ము కూడా టీడీపీ అధినేతకు, లోకేశ్‌కు, ఇతర నేతలకు చేరినట్లు జగన్ రెడ్డి గానీ, అతని జేబు సంస్థ సీఐడీ గానీ నిరూపించ లేకపోయిం దన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా తప్పుడు కేసులో ఇరికించి, అన్యాయంగా జైలుకు పంపారన్న టీడీపీ వాదన నిజమని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్ర బాబునాయుడిని అరెస్ట్ చేశాక సాక్ష్యాధారాలు సేకరిస్తు న్నామని చెప్పిన సీఐడీ,ఆయన్ని జైలుకు పంపి 50రోజు లైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేక పోయిందన్నా రు. సీఐడీ స్వతంత్య్ర దర్యాప్తు సంస్థగా కాకుండా ఒక గాసిప్ ఏజెన్సీగా మారింది. దర్యాప్తు సంస్థలు ఏవైనా సాక్ష్యాలు దొరికాక నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. కానీ రివర్స్ ముఖ్య మంత్రి రివర్స్ పాలనలో సీఐడీ కూడా రివర్స్‌లో పనిచేస్తోందని దాని పనితీరుతో తేలిపోయిం ది. కేవలం జగన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే సీఐడీ పరిధి దాటి వ్యవహరించింది. చంద్రబాబుకి బెయిల్ రాకుండా చేయడం కోసం జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంటే, సీఐడీ ముఖ్యమంత్రికి సహకరి స్తూ, న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తోందని ధూళిపాళ్ల విమర్శించారు.
పార్టీ ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు ఇన్‌కం టాక్స్ విభాగానికి టీడీపీ తెలియచేస్తూనే ఉంటుంది.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను, సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని ఆ పార్టీకి వచ్చిన అవినీతి సొమ్ముగా జగన్ ప్రభుత్వం, సీఐడీ చిత్రీకరించడం వాటి దిగజారుడుత నానికి నిదర్శనం. 2014-15లో 52.94లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం పొందడా నికి ఒక్కొ క్కరు రూ.100చొప్పున చెల్లిస్తే… తద్వారా పార్టీకి రూ.52.94 కోట్ల విరాళం వచ్చింది. 2016-17లో 60.75లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం పొంది, రుసుముగా రూ.60.75 కోట్లు పార్టీకి అందిం చారు. 2018-19లో 43.23లక్షల మంది సభ్యత్వం పొందితే, పార్టీకి రూ.43.23కోట్ల విరాళం వచ్చింది. మొత్తంగా 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే కేవలం సభ్యత్వ రుసుముగానే రూ.159.8కోట్లు పార్టీకి వచ్చాయి. కార్యకర్తలు ఇచ్చే సభ్యత్వ రుసుము.. ఇతర విరాళాల కంటే పార్టీ తనను నమ్ముకున్నవారికి అందించే చేయూత,సంక్షేమం, ఆర్థిక సహాయమే ఎక్కు వగా ఉంది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం.. వారి పిల్లలను చదివించడం, సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ ప్రీమియం అందించడం వంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీనే చూసుకుం టోంది. 2014-15 నుంచి 2018-19 వరకు టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ.68.53 కోట్లని పార్టీనే బీమా సంస్థలకు చెల్లించింది. 2018-19లోనే రూ.16.2కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియావంటి సంస్థల నుంచి ఒక్కో కార్యకర్తకు రూ.2లక్షల చొప్పున దాదాపు చనిపోయిన 5వేల మం ది కుటుంబాలకు రూ.100కోట్ల ను తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ రూపంలో అందించింది. ఏ ఇన్సూరెన్స్ సంస్థ కూడా వివరాలు లేకుండా ఎలాంటి చెల్లింపులు చేయదు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు కూడా బీమా సంస్థల వద్ద ఉన్నాయి. తెలుగుదేశంపార్టీ సభ్యత్వం వివరాలు.. కార్యకర్తలు ఇచ్చే రుసుము వివరాలు అన్నీ పార దర్శకమే. యూనియన్ బ్యాంక్ సహకారంతో బిల్ కాల్ మనీ అనే సంస్థద్వారా టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని టీడీపీ డిపాజిట్ చేసింది. ఆ సొమ్ములో ఎక్కడా పైసా కూడా అవినీతి సొమ్ములేదు…ఉండదు. తమ పార్టీకి వచ్చే విరాళాలు.. ఇతర సొమ్ము వివరాల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటి కప్పుడు ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సొమ్ము ఎలా వచ్చిందో.. ఎవరి ద్వారా వచ్చిందో చెప్పడానికి మాకు.. మా పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు కాబట్టి. కానీ కార్య కర్తల కష్టార్జితాన్ని అవినీతిసొమ్ముగా చిత్రీకరించేందుకు జగన్ సర్కార్, సీఐడీ ప్రయత్నం చేస్తున్నాయని ధూళి పాళ్ల ఆరోపించారు.
ఎలాంటి ఆధారాలు లేక పార్టీకి వచ్చిన సభ్యత్వ రుసుముని అవినీతి సొమ్ముగా చిత్రీకరిస్తోంది స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి ఎటువైపు నుంచి రూపాయి వచ్చినట్టు నిరూపించలేని దుస్థితికి దిగజారిన సీఐడీ చివరకు దిక్కుతోచక కార్యకర్తలు సభ్యత్వం పొందడానికి పార్టీకి చెల్లించిన సొమ్ముని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అవినీతి సొమ్ముగా, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ సొమ్ముగా చూపడానికి నానా తంటాలు పడు తోంది. జగన్‌రెడ్డి తన పక్కన హత్యలు చేసేవారిని, అత్యాచారాలు చేసేవారిని, దుర్మార్గుల్ని, బాబాయ్ ని చంపినవారిన పెట్టుకొని, ఇతరులు తప్పు చేశారని నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతున్నాడు. చంద్రబాబు అక్రమ అరెస్ట్… ఆయన్ని జైలుకు పంపడంలో జగన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరించిన తీరుపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. జగన్ రెడ్డి జేబు సంస్థ సీఐడీ.. చంద్రబాబుని జైల్లో పెట్టి చేయరాని పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే చివరకు సిగ్గులేకుండా కార్యకర్తలు పార్టీ సభ్యత్వానికి చెల్లించిన సొమ్ముని అవినీతి సొమ్ము అని చెబుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు ఏర్పాటు చేయకముందే, తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎందరో కార్యకర్తలు తెలుగుదేశం సభ్యత్వం పొంది, నిర్ణీత రుసుముని పార్టీకి చెల్లించారు. ఇదంతా పార్టీ ఆవిర్భవించిన తొలిరోజుల నుంచి జరుగుతూనే ఉందని ధూళిపాళ్ల తెలిపారు.
నిన్నటివరకు ఒక మాట.. ఇప్పుడొక మాట :
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందని జగన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది అజయ్ కుమార్ రెడ్డి. ఆయన జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ మరికొందరు నిన్నటి వరకు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు లేవు.. వాటిలో పరికరాలు లేవు అని గగ్గోలు పెట్టారు. మరి అదే మంత్రులు, అజయ్‌కుమార్‌రెడ్డి నేడు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి.. వాటికి అందించిన పరికరాలు, సాఫ్ట్ వేర్ మాత్రం సరిగా లేవని చెబుతున్నారు. అధికారముందన్న అహం కారంతో మాట్లాడే మంత్రులు.. వైసీపీ నేతల్ని ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ప్రజలు నమ్ముతున్నారనే, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచక్షణ కోల్పోయి నోరు పారేసుకుంటున్నారు. సీఐడీ ప్రభుత్వాధినేత చెప్పుచేతుల్లో పనిచేస్తూ గాసిప్ ఏజెన్సీ గా మారిందని మేమేమీ కల్పించి చెప్పటం లేదు.. దాని పనితీరుతో ఆ ఏజెన్సీనే అలా తయారైందని నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు.