అమరావతి: అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిరచారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్లను నరికివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.