- గ్లోబల్ సీఈవో నీల్మోహన్తో వర్చువల్గా భేటీ
- గూగుల్ ఏపీ హెడ్తోనూ సమావేశం
అమరావతి: రాష్ట్రానికి ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థలను పెట్టుబడులకు తీసుకు రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన యూట్యూబ్ సీఈవో నీల్మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. వారిద్దరితోనూ ఆన్లైన్ వేదికగా భేటీ కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చిం చినట్లు తెలిపారు. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోయే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాలపైనా వారితో చర్చించినట్లు వివరించారు.