అమరావతి,చైతన్యరథం: సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు తన స్వంత నియోజకవర్గంలో కుప్పంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి విమానంలో బెంగళూర్‌కు చేరుకొని అక్కడ నుండి కుప్పం నియోజకవర్గంలోని బెగ్గిలపల్లెకి హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారు. ఆయనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో జల్లిగానిపల్లె చేరుకొని అక్కడి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కెనాల్‌ను పరిశీలిస్తారు. మరలా అక్కడ నుండి రోడ్డు మార్గంలో చిన్నారిదొడ్డి గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్‌ను పరిశీలిస్తారు. అక్కడ నుండి బయల్ధేరి కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుండి 4.30 గంటల మధ్య సమయంలో కుప్పంలోని ఎన్డీయార్ సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుండి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకొని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి పూట అక్కడే బస చేసి మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకు ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి చేరుకొని అక్కడ నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడ నుండి పీఇఎస్ మెడికల్ కాలేజీకి చేరుకొని పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.10 నిమిషాలకు అక్కడ నుండి హెలికాఫ్టర్‌లో బెంగళూర్‌కు వస్తారు.