- ఉల్లంగుల ఏడుకొండలుకు ఎయిర్ కంప్రెషర్
- సీఎం రాకతో వెలుగొచ్చిందన్న కుటుంబసభ్యులు
నరసరావుపేట(చైతన్యరథం): యల్లమందకు చెందిన ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అంది స్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సందర్శించి ఎయిర్ కంప్రెషర్‌ను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటి వద్దే పింఛను అందజేసి వారి కుటుంబసభ్యులకు స్వయంగా కాఫీ తయారు చేసి ఇచ్చారు. ఆ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల చెక్కును ప్రజావేదిక వద్దే ముఖ్యమంత్రి చేతులమీదుగా అప్పటికప్పుడే అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో తమ ఇంటికి వెలుగొ చ్చిందని, హామీలు అమలు చేసి ఆ వెలుగు కలకాలం నిలిచేలా చేశారని ఏడుకొండలు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.