రామచంద్రపురం (చైతన్యరథం): మతసామరస్యానికి, సమాజంలో సమానత్వం, శాంతి కోసం ఇఫ్తార్ విందులు దోహదపడతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శుక్రవారం రామచంద్రపురంలోని చిన్న మసీదు, పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను మంత్రి పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ప్రార్థనలో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు రంజాన్ పర్వదినాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, ఉపవాస దీక్ష అనేది కేవలం అల్లా అనుగ్రహం కోసమే కాదని, సమాజంలో సోదర భావం, ఐకమత్యం, దయాగుణం, ప్రేమ పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి సుభాష్ అన్నారు. లోకశాంతి కోసం ముస్లిం సోదరులంతా అల్లాను ప్రార్థనలు చేయాలని కోరారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు